పెళ్లి జరుగాలని తెలుగు హీరోయిన్ పూజలు
హైదరాబాద్: తెలుగు హీరోయిన్ అంకిత కెరీర్ పరంగా అంతగా యాక్టివ్‌గా లేక పోవడంతో ఇక పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే గత కొంత కాలంగా ఆమెకు సంబంధాలు కుదరక పోవడంతో తన పెళ్లి భారం దేవుడపై వేసింది. ఇందుకోసం వివిధ ఆలయాలు తిరుగుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది.
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని మంగళవారం సినీనటి అంకిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఈమెకు స్వాగతం పలికారు. అంకిత మొదట రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఈమెకు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.

అంకిత సినిమాల గురించి మాట్లాడుతూ....లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అంకిత 'సింహాద్రి' చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె ఆశించిన స్థాయిలో కెరీర్ సాగలేదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ ప్రవేశించినా పెద్దగా లాభం లేక పోయింది.
ఆమె ఇప్పటి వరకు నటించిన సినిమాల వివరాల్లోకి వెలితే....లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమలో పావని కళ్యాణ్, శ్రీరామ్(కన్నడ), సింహాద్రి, అందరూ దొంగలే దొరికితే, విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు, లండన్(తమిళం), తక దిమి తా(తమిళం), రారాజు, ఖతర్నాక్(స్పెషల్ అప్పియరెన్స్), సీతారాముడు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, పోలీస్ అధికారి తదితర చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











