సైఫ్ డస్కవర్ చేసిన దక్షిణాఫ్రికా మోడల్
అంతర్జాతీయ స్థాయి మోడల్స్‌ను బాలీవుడ్‌లోకి ప్రవేశపెట్టడం సైఫ్ అలీఖాన్‌కు అలవాటు. తన సొంత సినిమా లవ్ ఆజ్ కల్‌లో బ్రెజిల్ మోడల్ జిసెల్లీ మోనీత్రోను హర్లీన్ కౌర్‌గా ప్రవేశపెట్టిన సైఫ్ ఇప్పునడు ఓ దక్షిణాఫ్రికా మోడల్‌ను హిందీ సినిమాకు పరిచయం చేయబోతున్నాడు. ఏజెంట్ వినోద్ సినిమాలో ఆయన ఆ మోడల్ అన్ లీ రాబర్ట్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆన్ లీ ఇటలీ తండ్రికి, ఫ్రెంచ్ తల్లికి జన్మించి దర్బన్‌లో ఉంటుంది. ఆమె కుటుంబం జర్మనీ నుంచి దర్బన్‌కు వచ్చి స్థిరపడిందని చెబుతున్నారు. డెనిమ్ బ్రాండ్ అడ్వర్జయిజ్‌మెంట్‌లో అన్ లీ నటించింది. ఆమె కాటే మోస్, జిజెలే బుంచెన్ వంటి సూపర్ మోడల్స్‌తో ప్రస్తుతం పనిచేస్తోంది. ఆన్ లీ ఓ ఇండోనేషియా సినిమాలో కూడా నటించిందట. ఆ సినిమా నుంచే సైఫ్ ఆమెను కనిపెట్టినట్లు చెబుతున్నారు. సైఫ్, కరీనా కపూర్‌తో పాటు ఏజెంట్ వినోద్‌లో ప్రియాంక చోప్తా నటిస్తుందని అనుకున్నారు. ఇప్పుడు ప్రియాంకకు బదులు ఆన్ లీ తెర మీదికి వచ్చింది.


Click it and Unblock the Notifications











