twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నా హజారే తో తెలుగు వాడి బాలీవుడ్ సినిమా : పిల్లలతో విప్లవం

    సోసైటీ లో నెలకొన్న అపరిశుభ్రత, అంటరానితనం, ఆర్దిక నేరాలను ఎలా అరికట్టారన్న కథాశంతో తెరకెక్కుతోన్న చిత్రమే” బచ్చె కచ్చె సచ్చె”

    |

    ఆరేళ్ళ కిందట వచ్చిన చిల్లర్ పార్టీ అనే బాలీవుడ్ సినిమా గుర్తుందా? పిల్లలంతా కలిస్తే ఈ సమాజాన్ని ఎలా మేల్కొలపగలరూ అన్న కాన్సెప్ట్, పిల్లల్లో ఉండే ఒక ఉత్సాహం ఎలాంటి పనినైనా చేయిస్తుందీ అన్న విశయం చెప్తూనే దాన్ని ఈ నాటి రాజకీయాలని అంతర్లీనంగా చర్చించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు మళ్ళీ అలాంతి సినిమానే ఓకటి బాలీవుడ్ లో రూపు దిద్దుకుంటోంది.

    జూన్ 2 విడుదల

    జూన్ 2 విడుదల

    సోసైటీ లో నెలకొన్న అపరిశుభ్రత, అంటరానితనం, ఆర్దిక నేరాలను ఎలా అరికట్టారన్న కథాశంతో తెరకెక్కుతోన్న చిత్రమే "బచ్చె కచ్చె సచ్చె". హిందీ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 2 విడుదల కానుంది. గతంలో తెలుగులో అధినేత, సరదాగా కాసేపు లాంటి సినిమాలను నిర్మించిన రవి సదాశివ్ స్వీయ దర్శకత్వంలో "బచ్చె కచ్చెసచ్చె " చిత్రాన్ని తెరకెక్కించారు.

    రవి సదాశివ్

    రవి సదాశివ్

    గతంలో తెలుగులో అధినేత, సరదాగా కాసేపు లాంటి సినిమాలను నిర్మించిన రవి సదాశివ్ స్వీయ దర్శకత్వంలో "బచ్చె కచ్చెసచ్చె " చిత్రాన్ని తెరకెక్కించారు. ఆశిష్ విద్యార్ది, ముఖేష్ తివారి ప్రధాన పాత్రల్లొ నటించిన ఈ సినిమాలో మరో ప్రత్యేకథ కూడా ఉంది ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సైతం ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కన్పించనున్నారు.

    బచ్చె కచ్చె సచ్చె

    బచ్చె కచ్చె సచ్చె

    ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ. నేటి జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వారివారి పిల్లల మాటలే వినాల్సి వస్తొంది. మరి అలాంటి కిడ్స్ మన సోసైటీలొ నెలకొన్న కొన్న సామాజిక రుగ్మతలను ఎలా అరికట్టారన్న కధాంశంతో బచ్చె కచ్చె సచ్చె సినిమాను తీశాము.

    వినొదత్మకంగా , సందేశాత్మకంగా

    వినొదత్మకంగా , సందేశాత్మకంగా

    రియాలిటీ కి దగ్గరగా ఉండే చిత్రమిది. అన్నా హజారే గారు మా కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా లో నటించారు. పూర్తి వినొదత్మకంగా ఉంటూ సందేశాన్ని అందించే చిత్రమిదన్నారు. ఈ చిత్రానికి సంగీతం : రవి శంకర్ ( సర్కార్ 3 ఫేం), బోలె, డివోపి: జయ్ నందన్ కుమార్, ఎడిటింగ్: వి.కామెపల్లి, నిర్మాతలు: మీనా, రవి, దర్శకత్వం : రవి సదాశివ్

    సైనికుడిగా పనిచేసి

    సైనికుడిగా పనిచేసి

    భారత దేశంలో అవినీతి నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తుల్లో అన్నా హాజారే ఒకరు. సైనికుడిగా పనిచేసిన ఆయన గ్రామాల అభివృద్ది కోసం ఒక రైతుగా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. , భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

    అవినీతి నిర్మూలన కోసం

    అవినీతి నిర్మూలన కోసం

    దీనిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లో పద్మశ్రీ అవార్డు తోనూ, 1992 లో పద్మ భూషణ్ అవార్డుతోను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా .

    9 ఏప్రిల్ 2011

    9 ఏప్రిల్ 2011

    అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు. 5 ఏప్రిల్ 2011 న జనలోక్ పాల్ చట్టాన్ని పోలినట్లు లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతు లభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించిన తరువాత నిరాహారదీక్ష విరమించాడు.

    English summary
    After his biopic on Anna Hazare "Anna Kisan Baburao Hazare" that released last year, he will now be seen doing a cameo in Bollywood film Bachche Kachche Sachche.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X