‘అన్నమయ్య సకల దేవతార్చన’ నయన్ తార

By Staff

కొసరాజు రాఘువయ్య మునిమనుమరాలు కొసరాజు నయన్ తార రాబోయే కాలానికి కాబోయే గాయనిగా తన ప్రస్థానం ఆరంభించారు. మొదటి ప్రయత్నంగా నయన్ తార పాడిన 'అన్నమయ్య సకల దేవతార్చన' పాటల ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, సురేష్ బాబు, సుమంత్, భారవి, జెమనీ కిరణ్, డాక్టర్ కె.ఎల్.నారాయణ, అరుణ్, రంజన్, భానుప్రసాద్, శ్యామలత తదితరులు హజరైనారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని డాక్టర్ డి.రామానాయుడుకు అందజేశారు.

ఈ సందర్భంగా డి.రామనాయుడు మాట్లాడుతూ, కొసరాజు రాఘవయ్యగారు మాకు మామయ్య అవుతారనీ, నేను సినిమా తీస్తుంటే దానికి కావలసిన సహాయం ఆయన చేసేవారని తెలిపారు. అంతేకాకుండా నేను తీసిన సినిమాలకు ఆయన చాలాసార్లు పాటలు రాశారనీ మంచి విజయాన్ని సాధించాయన్నారు. ఆయన మనుమరాలు పాడుతుందని తనకు అనుకోలేదు, చాలా చక్కగా తన్మయంత్వం చెందేలా పాడుతుందని మాత్రం ఇప్పుడే తెలిసిందనీ, భవిష్యత్తులో నయన్ తార మంచి గాయని కావాలని ఆయన ఆశీర్వదించారు. తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ తన బిడ్డ కార్యక్రమానికంటే ఎక్కువనీ, నయన్ తార పాడిన పాటలు వింటుంటే తన్మయత్వం చెంది నేరుగా దైవుని సన్నిదికి తీసుకువెళ్లే విధంగా ఉందనీ అన్నారు. మా కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయి పాట వింటుంటే ఆర్థుత కలిగిందన్నారు. కొసరాజు నయన్ తార మాట్టాడుతూ జీవితంలో మరచిపోలేని రోజు, సురేష్ మామయ్య బాగా ప్రోత్సహించారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్బమ్ లోని పాటలను కొసరాజు నయన్ తార స్వయంగా పాడి వినిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X