F2 ఫంక్షన్లో అదరగొట్టిన OLX బామ్మ.. వెంకటేష్ కౌంటర్ అదుర్స్!
సంక్రాతి పండుగ రేసులో భాగంగా విడుదలైన F2 ఫన్ అండ్ ప్రస్టేషన్.. సంక్రాంతి అలుళ్లు సినిమా కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో మల్టీస్టారర్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ చిత్రంలో ఓఎల్‌ఎక్స్ బామ్మగా నటించిన సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తన స్పీచ్‌తో అదరగొట్టింది. ఆమె ఏం మాట్లాడిందంటే..

అత్యంత సంతోషంగా గడిపిన సంక్రాంతి
F2 సినిమాలో మాదిరిగా ఉత్సాహవంతమైన క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగాలని ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించిన క్యారెక్టర్‌తో ఎంజాయ్ చేశాను. నాకు ఊహ తెలిసిన తర్వాత అత్యంత సంతోషంగా గడిపిన సంక్రాంతి పండుగ ఇదే. అందుకు కారణం F2 సినిమా విజయం

ఇది సినిమా కాదు
F2 ఓ సినిమా అని చెప్పను . తెలుగు రాష్ట్రాల్లో ఓ కుటుంబం ఇది. ఓ కుటుంబంలో చోటుచేసుకొన్న వినోదం. సంక్రాంతికి అరిసెలు తింటూ.. కనుమకు కోడికూర తింటూ సంక్రాంతి అల్లుళ్లను చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా ఇది అని అన్నపూర్ణ అన్నారు.

వెంకటేష్ కౌంటర్ ఇలా
ఇక F2 సినిమాలోని ఊరికే అలా చూస్తు ఉండకపోతే.. మీ పెళ్లాల కడుపులో కాయ కాయించవచ్చు కాదా అంటూ తన డైలాగ్‌ను అన్నపూర్ణ చెప్పారు. దానికి కౌంటర్‌గా 24 గంటలు ఇంట్లో పడి ఉంటే కాయ కాస్తుందా అంటూ వెంకటేష్ డైలాగ్ చెప్పడంతో వేదిక వద్ద నవ్వులు పూశాయి.

మేము లేకపోయినా గుర్తుంచుకోవాలి
తెలుగు రాష్ట్రాల్లో భాష తెలిసిన వారుకానివ్వండి. తెలియని వారికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మా ప్రొడ్యూసర్లు చాలా ముచ్చటగా ఉంటారు. మా ఇద్దరు హీరోలు మరీ ముచ్చటగా ఉంటారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పాంటేనియస్‌గా ఉంటారు. వీళ్లంతా ఎల్లకాలం బాగుండాలి. మేము ఉన్న ఇలాంటి సినిమాను చూసి మమ్మల్ని స్మరించుకొంటే అదే చాలూ అని అన్నపూర్ణ భావోద్వేగంగా మాట్లాడారు.


Click it and Unblock the Notifications











