ఇద్దరికీ పుత్ర శోకాలే.. : పరుచూరి.. ఒంటారయ్యాననే ఫీలింగ్ : అన్నపూర్ణ

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతి రావు మరణంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి.. నేడు తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కాసేపటి క్రితమే మరణించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

ఒంటరయ్యాననే ఫీలింగ్..

ఒంటరయ్యాననే ఫీలింగ్..

ప్రముఖ నటి అన్నపూర్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను ఆయన కలిసి చాలా చిత్రాల్లో కలిసి నటించాము, రేడీయో స్టేషన్‌లో కూడా ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన విద్యావంతుడు, చాలా చక్కగా మాట్లాడే వాడు. మొన్ననే గీతాంజలి గారు వెళ్లిపోయారు.. ఓ కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం.. ఇలా అందరూ వెళ్లిపోతుంటే ఒంటరయ్యామనే ఫీలింగ్ కలుగుతోంది..

అవి తీపి జ్ఞాపకాలు..

అవి తీపి జ్ఞాపకాలు..

ఆయనను కలిసి చాలా కాలమే అవుతోంది.. ఆయన చెన్నైలో ఉండటం మూలానా ఈ మధ్య కలవడం లేదు. ఆయన మరణం బాధాకరమైన విషయం. ఆ మధ్యలో ఓ సినిమాలో నటిస్తారని అన్నారు. కానీ ఆరోగ్యం బాలేదనడంతో రాలేదన్నారు. సంసారం ఓ చదరంగం చేసిన రోజులన్నీ తీపి జ్ఞాపకాలు. ఆయనతో చేసినవన్నీ కుటుంబ కథా చిత్రాలే.. ఆయన ఛలోక్తిగా ఉండే తండ్రి పాత్రలు పోషించేవారు, నేను బాధ్యతాయుతమైన తల్లి పాత్రను పోషించాను. ఈ కాలంలో ఆయనలా చేసే వారు కూడా లేరు. ఆయన ఓ మంచి తండ్రి, భర్త, మంచి రచయిత. మంచి మనిషిని కోల్పోయాం.. అదెప్పుడూ వెలితిగానే ఉంటుంద'ని అన్నారు.

ఇద్దరికీ పుత్ర శోకాలే..

ఇద్దరికీ పుత్ర శోకాలే..

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నాటక రచయితగా మాకు పరిచయం, సినిమా రచయితగా కలిసి పని చేయలేదు కానీ కలిసి నటించాము. మేము దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించారు. అప్పటికే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి చిత్రాలతో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇద్దరికీ పుత్ర శోకాలే మిగిలాయి.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 కొడుకు మరణంతో అలా..

కొడుకు మరణంతో అలా..

మా అన్న రెండో కొడుకు మరణంతో రఘుబాబు పరిషత్ అని స్థాపించి కొత్త రచయితలకు అవార్డులివ్వగా.. ఆయన కుమారుడు శ్రీనివాస్ షూటింగ్ సమయంలో మరణించడంతో అతని పేరు మీదుగా దర్శకత్వ శాఖలో అవార్డులు ప్రధానం చేసేవారు. మంచి నటుడు, ఎలాంటి పాత్రనైనా పోషించగలవాడు, మంచి రచయిత, ఆయన రాసిన పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. సినీ రంగానికి, విద్యారంగానికి ఇలా అందరికీ ఆయన మరణం బాధాకరమైన అంశ'మని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X