»   » విశాఖలో అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్

విశాఖలో అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    విశాఖపట్నం : అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి చెందిన ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి తన వ్యాపార విస్తరణలో భాగంగా వైజాగ్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించింది. స్థానిక ద్వారకానగర్ ఏరియాలోని శ్రీ‌నగర్‌లో ఆగస్టు 22వ తేదీన ఉదయం గం.7.30 నిమిషాలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.సాయిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించి వ్యాపార కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.

    సంస్థ మేనేజర్ మేనేజర్ పి.సుబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వందలాది మంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫిల్మ్ ఫైనాన్సర్స్ తరలి వచ్చి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్.సాయిబాబు మాట్లాడుతూ...మా సంస్థ ద్వారా తొలి ప్రయత్నంగా త్వరలో 'భాయ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. వైజాగ్‌తో పాటు అన్ని ఏరియాల్లో దశల వారీగా మా పంపిణీ సంస్థలను ప్రారంభించబోతున్నాము' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మీసాల రాము, వందలాది మంది అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.

    'భాయ్' మూవీ తెలుగుతో పాటు తమిళ అనువాదంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఈచిత్రాన్ని 'భాయ్' పేరుతోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'భాయ్' సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

    నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

    English summary
    Annapurna Studios Pvt. Ltd started a distribution office in Vizag today Aug 22 in the morning. Earlier Annapurna Studios banner has produced many successful films and the banner is all set to start the films distribution too. Nagarjuna, Richa Gangopadhayay, Prasanna and Nathalia Kaur starred Bhai will be first film to be distributed by Annapurna Studios banner.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more