Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విశాఖలో అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్
విశాఖపట్నం : అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి చెందిన ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి తన వ్యాపార విస్తరణలో భాగంగా వైజాగ్‌లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించింది. స్థానిక ద్వారకానగర్ ఏరియాలోని శ్రీనగర్‌లో ఆగస్టు 22వ తేదీన ఉదయం గం.7.30 నిమిషాలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.సాయిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించి వ్యాపార కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.
సంస్థ మేనేజర్ మేనేజర్ పి.సుబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వందలాది మంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫిల్మ్ ఫైనాన్సర్స్ తరలి వచ్చి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్.సాయిబాబు మాట్లాడుతూ...మా సంస్థ ద్వారా తొలి ప్రయత్నంగా త్వరలో 'భాయ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. వైజాగ్‌తో పాటు అన్ని ఏరియాల్లో దశల వారీగా మా పంపిణీ సంస్థలను ప్రారంభించబోతున్నాము' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మీసాల రాము, వందలాది మంది అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.
'భాయ్' మూవీ తెలుగుతో పాటు తమిళ అనువాదంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఈచిత్రాన్ని 'భాయ్' పేరుతోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'భాయ్' సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.
నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.