అన్నవరం జనవరి 1న
పవన్ కల్యాణ్ హీరోగా మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న అన్నవరం చిత్రం 2007 జనవరి 1న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో ఇదే బ్యానర్‌లో పవన్ కల్యాణ్ హీరోగా, భీమినేని దర్శకత్వంలో వచ్చిన సుస్వాగతం చిత్రం కూడా జనవరి 1వ తేదీనే రిలీజ్ కావడం, అది సూపర్‌హిట్ సాధించడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్‌లో, విడుదల తేదీ కూడా అదే కావడం మరో విశేషం.
ఒక చెల్లెలికి కష్టాలు కలిగించినందుకు ఒక ముఠానే తుడిచిపెట్టి, తన చెల్లెలికే కాదు, మరే చెల్లెలికీ అలాంటి దుష్టశక్తుల నుంచి ఎటువంటి ఆపద రాకూడదని చాటే ఉదాత్తమైన హీరో క్యారెక్టర్‌ను పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో పోషిస్తున్నారు. అందుకే, టైటిల్‌ని కూడా అన్నవరం అని పెట్టారనిపిస్తుంది. అన్నవరం ఒక పవిత్ర క్షేత్రం పేరు కాగా, మరో విధంగా ఇది ఒక అన్న - తన చెల్లెలికి ఇచ్చే వరం కాబట్టి అలా కూడా అన్నవరం అవుతుంది.
ఈ చిత్రంలో పవన్ చెల్లెలిగా ప్రేమిస్తే.. ఫేమ్ సంధ్య నటిస్తోంది. రమణ గోగుల సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications