అన్నవరం పాటల రికార్డింగ్
తమిళంలో సూపర్‌హిట్ అయిన తిరుపాచి ఆధారంగా పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటిస్తున్న అన్నవరం సినిమా రెండో షెడ్యూలు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సంగీత దర్శకుడు రమణ గోగుల స్వరపరిచిన పాటలను రికార్డు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు కెకె మీనన్ తొలిసారిగా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. పవన్ చెల్లెలుగా ప్రేమిస్తే ఫేం సంధ్య నటిస్తోంది. బ్రహ్మాజీ, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, సుమన్ శెట్టి, జీవా తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications