పవన్ అన్నవరం సంప్రాంతికే
పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమా విడుదల బాగా ఆలస్యమయ్యే అవకాశముంది. పవన్ తాజా చిత్రం బంగారం ఆశించునంతగా ఆడకపోవడంతో ఈసారి ఆయన ఏమాత్రం ఛాన్స్‌లు తీసుకోవడం లేదు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిన అన్నవరం సినిమాను ఆయన రీషూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం. తమిళంలో సూపర్‌హిట్ అయిన తిరుపాచికి అన్నవరం రీమీక్. ఈ సినిమాను సూపర్‌గుడ్ మూవీస్ ఆర్‌బి చౌదరి నిర్మిస్తుండగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. పర్‌ఫెక్షనిస్టు అయిన పవన్ కళ్యాణ్ రషెస్ చూసి కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో దర్శకుడు కూడా రీ షూటింగ్‌కు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరమే విడుదల కావలసిన ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. రమణ గోగుల స్వరపరిచిన ఆడియో డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశముంది.


Click it and Unblock the Notifications