అన్నీ మంచి శకునములేకు ఊహించని టాక్.. అంతా బాగున్నా అది మాత్రం.. ఇంతకీ సంతోష్ హిట్ కొట్టాడా అంటే!
టాలీవుడ్‌లో హీరోలుగా నెగ్గుకురావడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోలు హిట్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో సంతోష్ శోభన్ ఒకడు. చాలా రోజుల క్రితమే వచ్చిన అతడు.. పెద్ద విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుస చిత్రాలతో వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'అన్నీ మంచి శకునములే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీనికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? సంతోష్ ఇప్పుడైనా హిట్‌ను కొట్టాడా? చూద్దాం పదండి!
అన్నీ మంచి శకునములే :
యంగ్ హీరో సంతోష్ శోభన్ - లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి కలయికలో వచ్చిన చిత్రమే 'అన్నీ మంచి శకునములే'. మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇందులో రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, రోహిణి వంటి పేరున్న నటీనటులు కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

అలాంటి స్టోరీ.. డ్రామాతో:
ఫ్యామిలీ ఎథిక్స్‌కు కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే 'అన్నీ మంచి శకునములే'. ప్రేమించుకున్న హీరో, హీరోయిన్ల మధ్య గొడవలు జరగడం.. దీంతో వాళ్ల కుటుంబాలపై ప్రభావం పడడం వంటి డ్రామాలతో కూడిన అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక, ఈ సినిమా నుంచి వచ్చిన వాటికి భారీ రెస్పాన్స్ రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఫస్టాఫ్ ఇలా ఉందంటూ:
సంతోష్ శోభన్ - మాళవిక నాయర్ జంటగా నటించిన 'అన్నీ మంచి శకునములే' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయం చెప్పాడు. అందులో 'మొత్తం మీద ఫస్టాఫ్ బాగుంది. కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. కామెడీతో పాటు కొన్ని మంచి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సెకెండాఫ్ కోసం వేచి చూస్తున్నాను' అంటూ రాసుకొచ్చాడు.
సెకెండాఫ్ బాగుందంటూ:
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'అన్నీ మంచి శకునములే' చిత్రాన్ని వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో స్పందించారు. అందులో 'అన్నీ మంచి శకునములే సెకెండాఫ్ బాగుంది. కొన్ని భాగాల్లో సాగదీసినట్లు అనిపించాయి. స్లోగా సాగినట్లు ఉన్నా కొన్ని సీన్స్, క్లైమాక్స్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్‌లో ఈ చిత్రం ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' అని వివరించారు.
చాలా బోరింగ్‌గా ఉంది:
సంతోష్ శోభన్ - నందినీ రెడ్డి కాంబోలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' మూవీ చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'చాలా బోరింగ్.. మెయిన్ లీడ్ మధ్య ప్రేమ, స్నేహం, గొడవలు, డ్రామా పూర్తిగా డౌన్ అయ్యాయి. స్టోరీ నేరేషన్ కూడా డల్‌గా సాగింది. సినిమా మొత్తం బోర్ కొట్టింది. నా సహనాన్ని పరీక్షించింది. నందినీ రెడ్డి నుంచి ఇది ఊహించలేదు' అని చెప్పుకొచ్చాడు.
ఏదో మిస్ అయిందని:
'అన్నీ మంచి శకునములే' మూవీ చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా స్పందించారు. 'స్వప్న సినిమాస్ బ్యానర్‌లో అన్నీమంచి శకునములే సినిమా విజేతగా నిలిచింది. కానీ, క్లైమాక్స్‌లో ఏదో మిస్ అయిందని నమ్మలేకపోతున్నాను. ఎమోషనల్‌గా క్లైమాక్స్ ద్వారా కనెక్ట్ అయ్యాను కానీ హీరో, హీరోయిన్ల మధ్య కొంత సంఘర్షణ ఎమోషన్ ఉండాలి' అన్నారు.
ఏవరేజ్ అంటూ ట్వీట్:
సంతోష్ శోభన్ నటించిన 'అన్నీ మంచి శకునములే' మూవీని చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. 'అన్నీ మంచి శకునములే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇది మొత్తం అదే ఛాయలతో కూడి ఉంది. కానీ, సరిగా చూపడంలో తడబడినట్లు అనిపించింది. కామెడీ, కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ బాగున్నాయి. కానీ, మిగిలినదంతా ల్యాగ్ లాగా అనిపించింది. ఏవరేజ్' అని చెప్పుకొచ్చాడు.

ఓవరాల్‌గా ఎలా ఉంది?:
'అన్నీ మంచి శకునములే' మూవీకి సంబంధించిన షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు ప్రకారం.. ఈ సినిమాకు దాదాపుగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ఎమోషన్స్, క్లైమాక్స్ బాగున్నా సాగదీసినట్లుగా ఉడడంతో బోర్ కొడుతుందని చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయని, అవే మైనస్ అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











