అదరగొట్టారు: ఆరాధ్య డాన్స్, ఆనందంతో ఊగిపోయిన ఐశ్వర్య (వీడియో)
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. తన తల్లితో కలిసి వివిధ ఈవెంట్లలో సందడి చేస్తున్న ఈ చిన్నారి.... ఇటీవల మంగుళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కూడా హైలెట్ అయింది. తాజాగా ఆరాధ్య ముంబైలోని తన స్కూల్ వార్షికోత్సవంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టడంతో అందరి ఫోకస్ ఈ చిన్నారి సెలబ్రిటీ వైపు మళ్లింది.
పాఠశాల వార్షికోత్సవంలో ఆరాధ్య
ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆరాధ్య చదువుకుంటోంది. ఈ స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆరాధ్య తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

అంతా ముగ్దులైపోయారు
చిన్నారుల డాన్స్ బృందాన్ని లీడ్ చేస్తూ ఆరాధ్య ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకకు ఆమె తల్లిదండ్రులు ఐశ్వర్యరాయ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ కూతురు టాలెంట్ చూసి ఆనందంతో ఊగిపోయారు.

సినిమా షూటింగు వల్ల రాలేక పోయిన అమితాబ్
స్కూల్ వార్షికోత్సవంలో ఆరాధ్య బచ్చన్ పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అయితే తాతయ్య అమితాబ్ మాత్రం రాలేదు. తాను ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమా షూటింగులో భాగంగా థాయ్ లాండ్ లో ఉన్నానని అమితాబ్ తెలిపారు.

అమీర్ ఖాన్ కొడుకు ఆజాద్
ఈ వార్షికోత్సవ వేడుకలో ఆరాధ్యతో పాటు అమీర్ ఖాన్ కొడుకు ఆజాద్ రావు ఖాన్ కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి చిన్నారుల డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.
కూతురుతో కలిసి డాన్స్ చేసిన ఐశ్వర్య
కూతురు డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దురాలైన ఐశ్వర్యరాయ్.... ఆనందంతో ఊగిపోయింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











