నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య' కొత్త విశేషం
నాగచైతన్య త్వరలో దేవకట్టా దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య'అనే టైటిల్ తో ఓ చిత్రం చేయనున్నారనే సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ ని తీసుకున్నారని తెలుస్తోంది.అతను ఇప్పటికే పని ప్రారంభించాడని చెప్తున్నారు.అలాగే ఈ హీరోయిన్ గా నాగచైతన్య సరసన అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ని గానీ,డేట్స్ ని బట్టి కాజల్ ని కానీ హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాసం ఉంది.ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం జూన్ నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది.
ఇక ఈ చిత్రంలో నాగచైతన్య విజయవాడ ఆటో నగర్ ఏరియాకు చెందిన రౌడీగా కనపించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర అయాన్ రాండ్ పాపులర్ నవల..ది పౌంటెన్ హెడ్ లోని హోవర్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంటుందని దేవకట్టా చెప్తున్నారు. ఆయన ఈ విషయమై ట్వీట్ చేస్తూ...ఆటోనగర్ సూర్య పాత్ర హోవర్డ్ రోర్క్ పాత్రకు స్క్రీన్ పై యాక్షన్ వెర్షన్. ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎంత పాజిబులో..హోవర్డ్ రోర్క్ అనే పాత్ర భూమిపై అంతే సహజం.
మనందరిలోనూ ఆ పాత్ర ఉంది అన్నారు. ఇక ఆ పాత్ర చాలా ఐడియలిస్ట్ గా ఉంటూ తాను నమ్మిన విలువలకు దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఏం జరిగినా ఫరవాలేదు అన్న కోణంలో ముందుకెళ్తూంటాడు.ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దేవాకట్టా.


Click it and Unblock the Notifications











