అనూప్ రూబెన్స్ చేతికి పూరి ‘హార్ట్ ఎటాక్’

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, యంగ్ హీరో హీరో నితిన్ కాంబినేషన్లో 'హార్ట్ ఎటాక్'(వర్కింగ్ టైటిల్) రూపొందబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారయినట్లు తెలుస్తోంది. ఇటీవల పలు చిత్రాలకు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ 'హార్ట్ ఎటాక్' చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నట్లు సమాచారం.

పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ వైష్ణో అకాడమీ బ్యనర్‌పై ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నితిన్ గత చిత్రాలైన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలకు కూడా అనూప్ రూబెన్సే సంగీతం అదించారు. ఈ రెండు చిత్రాలు ఆడియో పరంగా కూడా మంచి విజయం సాధించాయి.

పూరితో పని చేసే అవకాశం రావడంపై నితిన్ స్పందిస్తూ...'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరుతోంది. పూరి గారు చెప్పిన సబ్జెక్టు వినగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ చేద్దామా అని ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది' అని తెలిపారు.

ఆగస్టు 15 నుంచి నాన్ స్టాప్‌గా యూరఫ్, గోవాలలో జరిగే భారీ షెడ్యూల్స్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. నితిన్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయి నితిన్ ని చాలా పెద్ద రేంజికి తీసుకెళ్లే సినిమాగా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని చాలా పెద్ద లెవల్‌లో తీస్తున్నారు. నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈచిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం : పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X