రాజమౌళి అకౌంట్లోకి అదనంగా రూ.10కోట్లు
'మర్యాద రామన్న" చిత్రానికి గాను దర్శకుడు రాజమౌళికి దాదాపు పది కోట్లు పారితోషికంగా అందుతోందంటూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. చిత్ర ప్రారంభానికి ముందే తన రెమ్యూనరేషన్ ని ప్రాఫిట్స్ లో షేర్ గా తీసుకుంటానంటూ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్న రాజమౌళికి ఇప్పుడు బాగానే గిట్టుబాటు అయిందట. ఆల్ రెడీ'మర్యాద రామన్న" చిత్రానికి 25కోట్ల వరకూ బిజినెస్ పూర్తవగా శాటిలైట్ అండ్ డివిడి రైట్స్ కలిపి మరో మూడు కోట్లు అనుకున్న మొత్తంగా 28 కోట్ల సినిమా అయింది. కేవలం 12కోట్ల బడ్జెట్ తో పూర్తవనున్న ఈ చిత్రానికి 16 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టేననీ, దర్శకుడికి 10కోట్లు, నిర్మాతలకి 6 కోట్లు చొప్పున లాభాలు మిగులుతాయనీ అంటున్నారు. సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని పాటల్ని జులై 4న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











