మోహన్ బాబుతో పాటు ఏడుగురిపై కేసు నమోదు
వరంగల్: 'దేనికైనా రెడీ' వివాదం నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబుతో పాటు మరో ఏడుగురిపై వరంగల్ జిల్లా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేనికైనా రెడీ చిత్రం బ్రాహ్మణుల కించ పరిచే విధంగా ఉందని బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్ జనగామ కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరుపాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు చిత్ర నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, నడుడు బ్రహ్మానందం, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఎ. ధనలక్ష్మి, రచయిత కోన వెంకట్ మరియు వెంకట సుబ్రహ్మణ్యం, బి. రవిలపై కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని జనగామ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నరేందర్ తెలిపారు.
కాగా...ఇటీవల విష్ణు మీడియాతో మాట్లాడుతూ....
కోర్టులో కేసులు నడుస్తున్నందున బ్రాహ్మణులతో ఏర్పిడిన వివాదంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని చెప్పిన విష్ణు.... వివాదాలు కావాలని తెచ్చుకోమని, అనుకోకుండా జరుగుతాయని, ఎలాంటి వివాదం అయినా సినిమా వారికి ప్లస్సవుతాయని, ఫ్రీ పబ్లిసిటీ గా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.
బ్రతికుండగానే తన తండ్రికి పిండ ప్రధానం చేయడాన్ని ఆయన నీచమైన చర్యగా పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, అందుకే కోర్టుకెక్కినట్లు వెల్లడించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎవరికీ భయ పడాల్సిన అవసరం లేదని మా నాన్న చెప్పారని విష్ణు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











