twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌బాబు పై మరో పిటీషన్

    By Srikanya
    |

    Mohan Babu
    హైదరాబాద్‌: మోహన్ బాబుకి 'పద్మశ్రీ' వివాదం ఇప్పుడప్పుడే వదిలేటట్లులేదు. 'దేనికైనా రెడీ' సినిమా టైటిల్స్‌లో నిర్మాత మోహన్‌బాబు పేరుకు ముందు పద్మశ్రీ పదాన్ని వినియోగించడంపై దాఖలైన కేసులో భాజపా నేత ఎన్‌. ఇంద్రసేనారెడ్డి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. 'ఝమ్మంది నాదం' సినిమా స్క్రిఫ్ట్‌కు సంబంధించి ప్రాంతీయ సెన్సార్‌ బోర్టు కార్యాలయానికి సమర్పించిన పత్రాల్లో పేరుకు ముందు 'పద్మశ్రీ' ఉందని తెలిసికూడా మోహన్‌బాబు సంతకం చేశారని అందులో పేర్కొన్నారు.

    దేనికైనా రెడీ సినిమా కేసులో.. తనకు తెలియకుండా సినిమా టైటిల్స్‌లో పద్మశ్రీ వినియోగించారని మోహన్‌బాబు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డి మరో పిటిషన్‌ వేశారు. స్పందించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని మోహన్‌బాబును ఆదేశించింది. ఝుమ్మందినాదం చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తూ నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో మంచు మనోజ్ హీరోగా చేసారు. తాప్సీ ఆ చిత్రంతో పరిచయం అయ్యింది.

    మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ''కథ, నటీనటులు... వీటి మీద నమ్మకంతో నేను సినిమాలు చేస్తూ వచ్చాను. నటుడిగా అయినా నిర్మాతగా అయినా నా పద్ధతి ఇదే. ఇలాగే ఆ రోజుల్లో 'పెదరాయుడు' సినిమాని చేశాను. కానీ ఆ సినిమా మీద నమ్మకం లేక విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేనే సొంతంగా విడుదల చేశాను. ఇప్పుడు 'పాండవులు పాండవులు తుమ్మెద'ని రూ.30 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాం. ఈ సినిమాని పంపిణీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేను సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్నాను. అప్పుడు 'పెదరాయుడు' ఎలా విజయం సాధించిందో... ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుంది'' అన్నారు మోహన్‌బాబు.

    English summary
    A Division Bench of the High Court comprising Chief Justice Kalyan Jyothi Sen Gupta and Justice P.V. Sanjay Kumar took on record another complaint against cine actor and producer Mohan Babu, wherein it was alleged that he had used the title ‘Padma Shri’ before his name in the titles of another film produced by him.Mr. Reddy field material regarding the film ‘Jhummandi Naadam’. This showed Mr. Mohan Babu as sole proprietor of the film and the titles showed word ‘Padma Shri’ before his name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X