అదరగొట్టిన రామ్ గోపాల్ వర్మ బెజవాడ రౌడీలు, మళ్లీ వివాదం
రామ్ గోపాల్ వర్మ బెజవాడ రౌడీలు సినిమా మరోసారి వివాదం సృష్టించింది. విజయవాడ వీధులు కత్తులు, తల్వార్లు పట్టుకున్న రౌడీలతో ఒక్కసారిగా బెదిరిపోయాయి. రౌడీలు మారణాయుధాలతో వీధుల్లోకి వచ్చి హంగామా చేస్తుంటే ప్రజలు హడలిపోయారు. అయితే, అది సినిమా షూటింగ్ అని తెలుసుకుని ఊరట చెందారు. అయితే, ఈ సంఘటన మరో వివాదానికి కారణమైంది. బెజవాడ రౌడీలు సినిమా షూటింగు ఆపించాలని విజయవాడలోని న్యాయవాదులు పోలీసు కమిషనర్‌ను కోరారు.
బెజవాడ రౌడీలు సినిమా టైటిల్ మార్చాలని, కథను కూడా మార్చాలని విజయవాడ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ పెట్టేందుకు రామ్ గోపాల్ వర్మ పూనుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాత గాయాలను నిద్రలేపి రెచ్చగొట్టేందుకు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అనుమతి లేదనే కారణంతో పోలీసులు మొదట్లో షూటింగ్ ఆపేశారు. అయితే, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ షూటింగుకు అనుమతి తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











