twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మను నిర్మాతల మండలి బహిష్కరించాలి

    By Srikanya
    |

    కులం, మతం, ప్రాంతంతో పాటు ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సినిమా టైటిల్ ఉండకూడదని ఇండియన్ పీనల్ కోడ్ 153(ఎ)లో స్పష్టంగా పేర్కొన్నా 'రెడ్డిగారు పోయారు'కి చలన చిత్ర మండలి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందని జాతీయ రెడ్డి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి.లక్ష్మీ కరుణాకర్ రెడ్డి తెలిపారు. సమాజానికి హాని కలిగించే చిత్రాలు నిర్మిస్తున్న వర్మను సినీరంగం నుంచి బహిష్కరించాలని ఆమె దర్శక నిర్మాతల మండలికి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చిత్రాల్లో నటించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నటీనటులకు విజ్ఞప్తి చేశారు.

    అలాగే... 'రెడ్డిగారు పోయారు' సినిమా టైటిల్‌ను తక్షణం ఉపసంహరించుకోకపోతే రెడ్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని జాతీయ రెడ్డి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి.లక్ష్మీ కరుణాకర్ రెడ్డి దర్శకుడు రాంగోపాల్ వర్మను హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గాన్ని అసహ్యించుకునే రీతిలో సినిమాలను నిర్మించడం పరిపాటైందని ఆమె ఓ ప్రకటనలో మండిపడ్డారు. గతంలో వర్మ రక్తచరిత్ర ద్వారా రెడ్లను స్త్రీ లోలురుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించడం జరిగిందన్నారు.

    English summary
    G. Laxmi Karunakar Reddy, National reddy Welfare Association, said that she want to file a case against RGV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X