ఎన్టీఆర్ బయోపిక్, తెరపైకి మరో దర్శకుడి పేరు!

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారణగా రూపొందుతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమా కొంత కాలం క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ అనూహ్యంగా తప్పుకున్నాడు. దీంతో చిత్ర యూనిట్ దర్శకుల వేట ప్రారంభించడం జరిగింది.

ఈ నేపథ్యంలో తెరపైకి చంద్ర సిద్ధార్థ్ పేరు వినిపిస్తోంది. ఆ నలుగురు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌క‌త్వం బాల‌కృష్ణే వ‌హిస్తార‌ని సమాచారం. ఇదివరుకే చంద్ర సిద్ధార్థ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.

another director in talks for ntr biopic!

రాఘవేంద్రరావ్ ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని వార్తలు వచ్చాయి, కాని ఆ న్యూస్ లో నిజం లేదని సమాచారం. అన్ని కుదిరితే ఈ వారం నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X