బ్యాడ్ టైమ్ లో మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య నుంచి సర్‌ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న బిగ్ బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికే ఆచార్య బాక్సాఫీస్ రికార్డులు ఒక రేంజ్ లో ఉండేవి. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ పై ఇంకా క్లారటీ అయితే రాలేదు. కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో తగ్గేలా లేదని విడుదల తేదీని వాయిదా వేస్తూ వస్తున్నారు.
దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు అయితే మాములుగా లేవు. పైగా మణిశర్మ అందించిన మొదటి సాంగ్ తోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆ సాంగ్ అనంతరం వెంటనే మరో పాటను విడుదల చేయాలని అనుకున్నారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఇక ఫైనల్ గా ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడిన కొరటాల మరో సాంగ్ రిలీజ్ పై చర్చలు జరిపినట్లు సమాచారం.

వీలైనంత త్వరగా రెండవ సాంగ్ అప్డేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన అన్ని పాటలు సిద్ధమైనట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ - మెగాస్టార్ చిరంజీవి కలిసి డ్యాన్స్ చేసిన ఒక పాటతో పాటు కాజల్ మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ కూడా నెక్స్ట్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయట. అందులో ముందుగా ఏ పాటను విడుదల చేస్తారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం ఆచార్య ఇప్పట్లో రాకపోవచ్చని రూమర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











