హై బడ్జెట్ హీరోల లిస్ట్ లో చేరిపోయిన మరో హీరో..!?
అసిస్టెంట్ డైరెక్టరైనా కెరీర్ ప్రారంభంలోనే 'అష్టాచమ్మా" ఆడి ఆ ఆటలో ఎత్తులు వేయడం బాగా వంట పట్టించుకున్న హీరో నాని. లోబడ్జెట్ హీరోగా తక్కువ టైమ్ లోనే మంచి పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'ఈగ"లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాని ఈ చిత్రంతో 22కోట్ల బడ్జెట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.
అదేంటి అనుకుంటున్నారు..డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'ఈగ" బడ్జెట్ 22కోట్లు కాబట్టి. అత్యధిక శాతం బ్లూ మ్యాట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటి వరకు జరిగిన దాంతో 30శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ఈ నెల 6 నుండి జరగనుంది. విజువల్ ఎఫెక్ట్స్ కే 5కోట్లు ఖర్చుపెడుతున్న ఈ చిత్రంలో నానికి జోడిగా సమంతా నటిస్తుండగా మరో కీలక పాత్రలో విలన్ గా కన్నడ నటుడు సుధీప్ నటిస్తున్నాడు. సెల్యూలాయిడ్ వండర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











