Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్ ఆచార్య కోసం మరో స్టార్ హీరోయిన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆచార్య ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒక డిఫరెంట్ సోషల్ మెస్సేజ్ సినిమాతో రానున్న మెగాస్టార్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. సైరా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఆచార్య పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక దర్శకుడు కొరటాల శివ కూడా అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను రూపొందిస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాలో హీరోయిన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కాజల్ అగర్వాల్ అని ఆల్ మోస్ట్ ఫిక్స్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర అమెదేనట. స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిరుతో స్టెప్పులు వేసిన అనుష్క ఆ తరువాత సైరా సినిమాలో ఝాన్సీ రాణిగా గెస్ట్ రోల్ చేసింది.
ఇక ఇప్పుడు ఆచార్యలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి. రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ పాత్రపై ఇప్పటికే మెగాస్టార్ ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక మెగాస్టార్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్, చిరంజీవి పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు కొరటాల ఇప్పటికే ఒక షెడ్యూల్ ని రెడీ చేసినట్లు సమాచారం. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.