రామ్ చరణ్ ‘జంజీర్’ మళ్లీ లీగల్ సమస్యల్లో!
ముంబై : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'జంజీర్' చిత్రం మొదలైనప్పటి నుండి ఏదో ఒకరకంగా లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఈచిత్రం కాపీరైట్స్ విషయమై సలీమ్-జావేద్ కోర్టుకెక్కారు. ఆ తర్వాత ప్రకాష్ మెహ్రా కొడుకులైన అమిత్, సునీత్, పునీత్ మధ్య రీమేక్ రైట్స్ విషయంలో విబేధాలు వచ్చి వ్యవహారం కోర్టు కెక్కింది.
తాజాగా మరో సారి 'జంజీర్' చిత్ర దర్శక నిర్మాతలు లీగల్ నోటీసులు అందుకున్నారు. ఈ సారి నోటీసులు జారీ చేసింది బిజినెస్‌మేన్ ప్రిన్స్ తులిప్ మరియు అమిత్ మెహ్రా. గతంలో వీరిద్దరు జంజీర్ నిర్మాణంలో ప్రకాష్ మెహ్రా కొడుకులైన సునీత్, పునీత్‌తో భాగస్వాములుగా ఉన్నారు.
తాజాగా తులిప్ నోటీసులు పంపడానికి కారణం జంజీర్ చిత్రం షూటింగులో తులిప్‌కు చెందిన బైక్ వాడి దాన్ని డ్యామేజ్ చేయడమే. ఈ మేరకు ఈ మేరకు ఆయన రిలయన్స్ సంస్థకు, దర్శకుడు అపూర్వ లఖియాకు నోటీసులు పంపారు. అపూర్వ లఖియా తన బైకును సాధారణంగా వాడుకుంటానని తీసుకుని జంజీర్ సినిమాలో ఓ సాంగు చిత్రీకరణలో వాడారని, అది డ్యామేజ్ అయిందని తన నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ నోటీసులకు దర్శక, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
సెప్టెంబర్ 6న జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది. రామ్ చరణ్ నటించని తొలి బాలీవుడ్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.


Click it and Unblock the Notifications











