twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో 'చుట్టాలబ్బాయి': అంతమాట అంటారా, రిలీజ్ ఆపుతామంటూ హెచ్చరిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం రాజుకుంది. ఈ రోజు విడుదలకు సిద్దమైన చుట్టాలబ్బాయి చిత్రం రిలీజ్ ఆపుతామంటూ హెచ్చరికలు వస్తున్నాయి. ప్రముఖ నటుడు సాయికుమార్ కొడుకు ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి సినిమా ఇవాళ విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమాకు వీరభద్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను అడ్డుకుంటామని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు హెచ్చరించాయి.

    అయితే ఈ వివాదానికి కారణం ఈ సినిమాలో ఆది చెప్పిన డైలాగ్. 'ఈగో రెడ్డి అంటే గోనగన్నారెడ్డిలా ఉంటాడనుకున్నా... గోనెసంచిలమ్ముకునేవాడిలా ఉన్నాడేంట్రా' అని ఆది చెప్పిన డైలాగ్ తమ సామాజిక వర్గాన్ని అవమానించినట్లుగా ఉందని, మనోభావాలు దెబ్బతిన్నాయని సదరు సామాజికవర్గం ఆరోపిస్తోంది. ఈ డైలాగుతో ట్రైలర్ వచ్చింది. దాని ఎఫెక్టే ఇది.

    ఇక ఈ సీన్ తొలగించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని, లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సాయికుమార్ అంటే తమకు గౌరవముందని, ఇలాంటి చర్యలకు పాల్పడి తమ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని సామాజిక వర్గం నేతలు సూచించారు. ఈ విషయమై ఇంకా దర్శకుడు వీరభధ్రం కానీ హీరో ఆది కానీ ఇంకా మాట్లాడలేదు.

    చుట్టాలబ్బాయి విషేషాలకి వస్తే..

    డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి మాట్లాడుతూ...

    డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి మాట్లాడుతూ...

    ఆది, సాయికుమార్ గారు క‌లిసి ఫ‌స్ట్ టైమ్ న‌టించారు. ట్రైల‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది. ఈ చిత్రం చేసే అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌లు రామ్, వెంక‌ట్ గార్ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా త‌ర్వాత మా నిర్మాత‌ల‌కు చుట్టాల‌బ్బాయి అనేది ఇంటి పేరుగా మారుతుంది. అంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు.

    నిర్మాత‌లు రామ్ - వెంక‌ట్ మాట్లాడుతూ...

    నిర్మాత‌లు రామ్ - వెంక‌ట్ మాట్లాడుతూ...

    మా డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ ప‌ని రాక్ష‌సుడు. ఈ సినిమా చాలా బాగా తీసాడు. మేము ఈ సినిమాని నిర్మించాం అంటే దానికి కార‌ణం వీర‌భ‌ద్ర‌మ్. ఆయ‌న‌కి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. సినిమా బ్ర‌హ్మాండంగా వ‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంది అని ఆశిస్తున్నాం. 3

     మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాట్లాడుతూ...

    మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాట్లాడుతూ...

    డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ గురించి చెప్పాలంటే...చాలా మంచి మ‌నిషి. స‌క్సెస్, ఫెయిల్యూర్ కి సంబంధం లేకుండా ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకి స‌క్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం ఉండ‌దు అన్నారు.

    హీరో ఆది మాట్లాడుతూ..

    హీరో ఆది మాట్లాడుతూ..

    సంవ‌త్స‌రం పాటు క‌ష్ట‌ప‌డి మా డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ గారు ఈ సినిమాని తీసారు. ఆయ‌న ఎప్పుడూ సూప‌ర్ హిట్ కొడుతున్నాం అని పాజిటివ్ గా అంటూ మా అంద‌రికీ ఎన‌ర్జీ ఇచ్చేవారు. త‌మ‌న్ మ్యూజిక్ కి డ్యాన్స్ చేయాల‌నేది నా డ్రీమ్. అది ఈ సినిమా ద్వారా నెర‌వేర‌డం హ్యాపీగా ఉంది.

    సాయికుమార్ మాట్లాడుతూ....

    సాయికుమార్ మాట్లాడుతూ....

    ఆదితో క‌లిసి న‌టించ‌డం నాకు కిక్ ఇచ్చింది. ఆది అభిమానులంద‌రికీ చుట్టాల‌బ్బాయి. మంచి స్టోరీ, సాంగ్స్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంట‌ర్ టైన్మెంట్...ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్

    ఈ చిత్రానికి సంగీతం : ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ : ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌ : నాగేంద్ర, ఎడిటింగ్‌ : ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు : భవాని ప్రసాద్‌, స్టిల్స్‌ : గుణకర్‌.

    English summary
    Now it is team Chuttalabbayi’s turn to face the brunt of the angry community. Apparently, the character 30 years Pruthvi is portraying is called ‘Ego Reddy’ and this has not gone down too well with the community now, and they have started a protest against it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X