అదే కథతో జె.డి కి పోటి

సిద్దం చిత్ర కథ విధి నిర్వహణలో జాతీయస్థాయి అవార్డు పొందిన ఎస్.ఐ దయానాయక్ ప్రేరణగా తీసుకుని రూపొందించామని జె.డి చెప్తున్నారు.జగపతిబాబు పాత్ర పేరు దయ అని, ఈ కథను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అందించారని తెలియజేశారు. ముందుగా దయానాయక్‌తో చర్చించామని చెప్పారు. ఆయన తమతో... చావడం కన్నా చంపడమే చాలా కష్టమన్నారని, దయానాయక్ ప్రతిరోజూ దేవుడిని పూజిస్తూ ఈ రోజు ఎవర్నీ చంపకూడదనుకునే వారట అని జె.డి వెల్లడించారు.
సిద్దంలో జగపతిబాబు టైటిల్ రోల్ దయానాయక్‌గా నటించారు. 'ఎన్‌కౌంటర్ దయానాయక్' చిత్రంలో ముంబాయికి చెందిన మోడల్ సచిన్ ఇన్‌స్పెక్టర్ దయానాయక్‌గా నటించారు.సింధుమీనన్ జగపతిబాబు కి జోడిగా నటించింది. 'ఎన్‌కౌంటర్ దయానాయక్' కి జోడీగా హీరోయిన్‌గా మొనాలిసా నటించింది. ఇక కన్నడ చిత్రంలో డాన్‌గా హిందీ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్, సి.బి.ఐ. అధికారిగా అనంత్‌నాగ్ చేసారు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు.
సిద్దం చిత్రాన్ని శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. అలాగే దయానాయక్ చిత్ర సమర్పకుడు మల్లిఖార్జునరావు నిర్మించారు.జె.డి.చక్రవర్తి సిద్దం సినిమాకు దర్శకత్వం వహించారు. రాజేంద్రబాబు..దయానాయక్ చిత్రాన్ని రూపొందించారు. అంటే..ప్రేక్షకులు ఒకే సారి దయానాయక్ జీవిత చరిత్ర రెండు వెర్షన్లతో చూడబోతున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











