సినిమా ఇండస్ట్రీలో ఇక నుంచి 24 క్రాఫ్ట్స్ కాదు.. 25 క్రాఫ్ట్స్!
లాక్ డౌన్ ఎత్తివేయగానే సినిమా షూటింగ్స్ హ్యాపీగా చేసుకోవచ్చని చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలోనే కరోనా వైరస్ ఎక్కువ భయాన్ని కలిగిస్తోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే బచ్చన్ లాంటి ఉన్నతమైన ఫ్యామిలీకె ఇబ్బందులు తప్పలేవు. ఇక అంతంత మాత్రంగా ఉండే తమ పరిస్థితి ఏమిటనేది చాలా మందిలో కలుగుతున్న ప్రశ్న.
రోజురోజుకి కరొనా కేసుల సంఖ్య ఊహించని విదంగా పెరుగుతున్నాయి. తెలుగు సీరియల్స్ కి సంబంధించిన కొంత మంది నటీనటులకు కూడా కారోన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. అందుకే షూటింగ్స్ లో పాల్గొనడానికి చాలా మంది భయపడుతున్నారు. అయితే ఇక నుంచి టాలీవుడ్ లో కరోనా కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్రాఫ్ట్ కూడా షూటింగ్స్ లో పాల్గొనబోతోందట. 25వ క్రాఫ్ట్ గా కరోనా ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాన్ని టాలీవుడ్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

నటీనటులకు, టెక్నీషియన్స్ కి వైరస్ సోకకుండా వారు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ లో వర్క్ చేయనున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గ దర్శకుల ఆధారంగా ఈ విభాగం పని చేయనుంది. అలాగే ప్రతిరోజూ లొకేషన్స్ లో శానిటైజేషన్ చేసి కాస్ట్యూమ్ వంటి వాటికి ఎలాంటి వైరస్ తాకకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారట. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











