twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ డైలాగుపై మరో కుళ్లు జోక్

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మ్యాన్'లోని ఉచ్చ డైలాగుపై అంతటా జోక్స్ వినపడుతున్న సంగతి తెలిసిందే. 'ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చా' అంటూ మహేష్ బాబు చెప్పే ఈ డైలాగు ఇప్పుడు ఫేస్ బుక్ లలో, ట్విట్టర్ లలో నవ్వులు కురిపిస్తోంది. తాజాగా ఈ డైలాగుని అడ్డం పెట్టుకుని క్రియేట్ చేసిన ఓ జోక్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. ఆ జోక్ లో...మహేష్ 'ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చా' అనగానే - "కొత్తగా వీడు పోయించేదేముంది..రోజూ పోస్తూనే ఉంటాం కదా..కొంపదీసి వీడే జిప్పు తీసి పోయిస్తాడా ఏంటి" అంటూ బ్రహ్మానందం అనుకుంటున్నట్లు గా క్రియేట్ చేసారు.

    ఈ జోక్ ఇప్పుడు ఫేస్ బుక్ లో ఎక్కడ చూసినా కనిపిస్తూ పాపులర్ అయ్యింది. జోక్ కాస్త అసభ్యంగానే ఉన్నా జనం దీన్ని షేర్ చేసుకుంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంతకుముందు 'ఉచ్చ పోయించడానికి మహేష్ బాబు ఏమైనా ముంబైలో సులభ్ కాంప్లెక్స్ కడుతున్నాడా, ఆ వ్యాపారం గానీ మొదలు పెట్టబోతున్నాడా' అనే జోక్ పాపులర్ అయ్యింది.

    ఇక దర్శకుడు దేవకట్టా కూడా ఈ డైలాగుని ప్యారెడీ చేస్తూ ట్విట్టర్ లో...

    పేషెంట్:"నాకు ఉచ్చ రావటం లేదు"

    డాక్టర్: "ముంబై వెళ్లు అక్కడ మహేష్ అందరికీ ఉచ్చపోయిస్తున్నాడు"!

    ఈ జోక్ ని నిజానికి యువ దర్శకుడు దేవ కట్టా సరదాకోసమే పెట్టినా మహేష్ ఫ్యాన్స్ దీనిపై చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దాంతో వెంటనే దేవకట్టా..ఓ డైలాగుని జోక్ చేస్తున్నామంటే దానికి కల్ట్ స్టేటస్ వచ్చినట్లే..అయినా మహేష్ కామిడి టచ్ తో చెప్పానన్నాడు అంటూ రాసారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం మహేష్ దీన్ని చాలా సీరియస్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తూ చెప్తున్నట్లు ఉంటుంది. ఇక మహేష్ తన బిజినెస్ మ్యాన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి డబ్బింగ్ పనుల్లో హడావిడిగా ఉంది. బిజినెస్ మ్యాన్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Parody for Mahesh Babu dailogues in Business Man film are creating havoc in Face Books and twitters. The film is releasing with highest number of prints on January 11.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X