twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి పెదరాయుడుగా సూపర్ స్టార్ రేంజ్ ఓ రేంజ్...

    By Sindhu
    |

    'పెదరాయుడు" చిత్రంలో మోహన్ బాబు చేసిన ద్విపాత్రాభినయం కంటే రజనీకాంత్ చేసిన ప్రత్యేకాభినయానికే ప్రత్యేక ప్రశంసలు లభించడం తెలిసిందే. ఆ సినిమా విడుదలై పదిహేను పదహారు సంవత్సరాలవుతోంది. అయినా సరే ఆ పాత్రలో రజనీ అభినయాన్ని మర్చిపోలేరు. మళ్లీ ఇన్నాళ్లకు రజనీ మరో భాషలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కన్నడ ప్రజలకు ఆరాధ్య దైవమైన స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ నటిస్తున్న నూరవ చిత్రంలో రజనీ స్పెషల్ రోల్ చేసేందుకు అంగీకరించారు.

    ఆ చిత్రం పేరు 'జోగయ్య" శివరాజ్ కుమార్ తో 'జోగి" అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన ప్రేమ్ అనే దర్శకుడు 'జోగయ్య" చిత్రానికి కూడా దర్శకుడు 'జోగయ్య" చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రేమ్ ఎవరో కాదు..తెలుగులో 'ఇడియట్" చిత్రంతో రసహృదయులందర్నీ పిచ్చెక్కించిన హీరోయిన్ రక్షిత భర్త.

    కాగా 'జోగి" చిత్రాన్ని తెలుగులో ప్రభాస్ తో వినాయక్ దర్శకత్వంలో 'యోగి" పేరుతో రీమేక్ చేసారు. రజనీకాంత్ నటిస్తున్నాడు కాబట్టి 'జోగయ్య" చిత్రం ఆటోమేటిక్ గా అటు తమిళంలోకి, ఇటు తెలుగులోకి అనువాదమైపోతుంది. అంతేనా..హిందీ, మలయాళ, జపనీస్ భాషల్లోకి కూడా అనువాదమైపోతుంది. కన్నడ రాజ్ కుమార్ పై గల అభిమానంతో రజనీ ఈ సినిమా చేస్తున్నారు. రజనీ ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని తెలిసిన మరుక్షణం నుంచి ఆ సినిమా రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X