‘డర్టీ పిక్చర్’ పై పట్టువదలని విక్రమార్కుడిలా...
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న డర్టీ పిక్చర్ ప్రదర్శనను ఎలాగైనా అడ్డుకునేందుకు స్మిత సోదరుడు పట్టు వదలని విక్కమార్కుడిలా పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నాడు. తన సోదరి వ్యక్తిగత జీవితాన్ని వక్రీకరించి, మితిమీరిన శృంగార దృశ్యాలతో చిత్రీకరించిన ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ సిల్క్ స్మిత సోదరుడు వి. నాగ వరప్రసాద్ గతంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా నాగ వర ప్రసాద్ మరో పిటీషన్ దాఖలు చేశారు.'డర్టీ పిక్చర్"కు కేంద్ర సెన్సార్ బోర్డు ఇచ్చిన 'A" సర్టిఫికెట్ నిలిపి వేయాలని మరో పిటీషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిందంటే...విడుదలకు మార్గం సుగమం అయినట్లే. అందుకే నాగ వర్మ ప్రసాద్ మరో పిటీషన్ దాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది.
ఐటం గాళ్‌గా స్మిత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, జీవన శైలి, ట్రాజెడీ, ఆత్మ హత్యతో ఆమె జీవితం ముగిసిన తీరు..ఇలా ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనలను ప్రస్తావిస్తూ దర్శకుడు మిలన్ లుద్రియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్మిత పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా, నసీరుద్దీషా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయడానికి నిర్మాతలు ఏక్తాకపూర్, శోభాకపూర్ సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











