నటి విద్యాబాలన్ పై క్రిమినల్ కేసు...
నటి విద్యాబాలన్ తో పాటు డర్టీ పిక్చర్ నిర్మాత, దర్శకుడు, హీరోలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సాయికృష్ణ ఆజాద్ అనే న్యాయవాది మంగళవారం నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశాడు. ఈ సినిమాను అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించారని, ఇలా చేయడం నేరమని సాయి కృష్ణ ఆజాద్ తన పిటీషన్లో పేర్కొన్నట్లు తెలుస్తూంది. డర్జీ పిక్చర్ విడుదల నిలిపి వేయాలని సిల్మ్ స్మిత సోదరుడు ఇప్పటికే నాగ వర్మ ప్రసాద్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఒకప్పటిక దక్షిణాది ఐటంగర్ల్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ సినిమా రూపొందుతోంది. విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైడ్స్ ను ఇంద్రా ఫిలింస్ దక్కించుకుంది. అయితే ఈ వివాదాల నేపథ్యంలో ఈ సినిమా మన రాష్టంలో చూసే అవకాశం దక్కుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











