twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సెన్సేషనల్ కథతో విజయేంద్ర ప్రసాద్.. డైరెక్షన్ ఎవరంటే..

    |

    బాహుబలి అంటే ఇండియన్ సినిమా అనేంత గొప్పగా కథలు రాసిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అంటే ఇండియన్ సినిమాకు శక్తిగా మారారు. ఆయన కథలు అందించిన భజరంగీ భాయ్‌జాన్, తదితర చిత్రాలు ఊహకు అందని కలెక్షన్లతో రికార్డు సృష్టించాయి. ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మణికర్ణిక చిత్రానికి కథ అందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. అదేమిటంటే..

    తెలుగులో మాట్లాడలేను

    తెలుగులో మాట్లాడలేను

    మణికర్ణిక ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కంగన రనౌత్ మాట్లాడుతూ.. నేను తెలుగులో మాట్లాడలేను. కానీ అర్థం చేసుకొంటాను. నా కోసం ఓ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నారు. ఆ సినిమాలో సమయంలో నేను తెలుగులో మాట్లాడటానికి డెఫినెట్‌గా ప్రయత్నిస్తాను అని అన్నారు.

    బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!

    అనేక సమస్యలను ఎదుర్కొన్నాను

    అనేక సమస్యలను ఎదుర్కొన్నాను

    మణికర్ణిక చిత్ర సమయంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నాను. షూటింగ్‌లో నా నుదుటి భాగానికి గాయమైంది. ఆ సమయంలో చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కోసం క్రిష్ ప్రాజెక్ట్‌ను వదిలి వెళ్లడంతో డైరెక్టర్‌గా మారాను. అప్పుడు ఆ సినిమాను తెరకెక్కించే విషయంలో నేను కొంత టెన్షన్ పడ్డాను అని కంగన పేర్కొన్నది.

     కంగన కోసం కథ రాస్తున్నాను

    కంగన కోసం కథ రాస్తున్నాను

    అదే విషయంపై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కంగన రనౌత్‌ కోసం కథ రాస్తున్నాను. ఆ సినిమాకు కంగన దర్శకత్వం వహించనున్నారు. అందులో తెలుగు భాషకు ఏమైనా స్కోప్ ఉంటుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి అని చెప్పారు.

    25న మణికర్ణిక రిలీజ్

    25న మణికర్ణిక రిలీజ్

    క్రిష్, కంగన డైరెక్షన్ వస్తున్న మణికర్ణిక చిత్రం జనవరి 25న రిలీజ్ కానున్నది. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బయోపిక్‌ చిత్రాలు ఘన విజయాలను సొంతం చేసుకొంటున్న నేపథ్యంలో ఝాన్సీ రాణి బయోపిక్‌ కూడా భారీ సక్సెస్‌ను అందుకోవడం ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

    English summary
    Manikarnika - The Queen of Jhansi is the real life story of the warrior queen. She was the first woman in history to fight against the British and started the first war for Independence. This movie directed by Krish and Kangana Ranaut. Written by Vijayendra Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X