మాట తప్పిన ప్రభాస్.. అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్ల పాటు కష్టపడిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అనంతరం ఈ స్టార్ హీరో రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభాస్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ప్రతి సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడాల్సిందే అనే ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ అభిమానులకు ఇటీవల మరొక బ్యాడ్ న్యూస్ చిరాకు తెప్పిస్తోంది.

 సాహో ఎఫెక్ట్..

సాహో ఎఫెక్ట్..

బాహుబలి అనంతరం ప్రభాస్ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సాహో సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. మొత్తానికి సినిమా హిందీలో అయితే ఆడింది గాని సౌత్ లో అయితే అడ్రస్ లేకుండా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలు సేఫ్ అయినప్పటికీ బయ్యర్లు చాలా వరకు నష్టపోయారు. అయితే ఆ సినిమాతో ప్రభాస్ ఒక నిర్ణయం తీసుకున్నాడు.

మాట తప్పిన ప్రభాస్..

మాట తప్పిన ప్రభాస్..

సాహో ప్రెస్ మీట్ లోనే ప్రభాస్ చాలా వరకు సినిమా రిజల్ట్ పై కాస్త కన్ఫ్యూజన్ గానే కనిపించాడు. అందుకే బిగ్ బడ్జెట్ సినిమాలకు కొన్నేళ్లపాటు దూరంగా ఉంటానని చెప్పాడు. 100కోట్ల వరకు వెళ్లకుండా మీడియం బడ్జెట్ లోనే సినిమాలు చేసే ప్రయత్నం చెస్తాను అని ప్రభాస్ వివరణ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన 20, 21 ప్రాజెక్టుల బడ్జెట్ లెక్కలు చూస్తుంటే ప్రభాస్ మాట తప్పినట్లు అర్ధమవుతోంది.

అభిమానుల ఆగ్రహం..

అభిమానుల ఆగ్రహం..

అసలైతే ప్రభాస్ బాహుబలి అనంతరం వీలైనంత వరకు చాలా వేగంగా సినిమాలు పూర్తి చేస్తానని చెప్పాడు. అనుకోకుండా సాహో కోసం ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ ఆ తరువాత సినిమాలను మాత్రం చాలా వేగంగా ఫినిష్ చేస్తానని అన్నాడు. ఇక రాధాకృష్ణ ప్రాజెక్ట్ విషయంలో ఇంతవరకు కనీసం టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు. ఇప్పటికే చాలాసార్లు ప్రభాస్ టీమ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కారణంగా గ్యాప్ రావడంతో సినిమా రిలీజ్ పై ఎఫెక్ట్ పడనుంది.

Recommended Video

Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
 మరో బ్యాడ్ న్యూస్..

మరో బ్యాడ్ న్యూస్..

ప్రభాస్ తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇటీవల నిర్మాత అశ్విని దత్ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను 2022 ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. అసలైతే షూటింగ్ అనుకున్న సమయనిక్ మొదలైతే.. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో సినిమా వచ్చేది. కానీ ప్రభాస్ 2021లో కనిపించేలా లేడు. అభిమానులకు ఇది మరో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపోతే ఇదే ఏడాది రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ దాదాపు రెండేళ్లు కష్టపడనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X