కలర్ 'మాయాబజార్' లో ఆ పాట కూడా...
మాయాబజార్ ని కలర్ చేసి ఈ మధ్యనే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక కారణాల వల్ల అందులో రెండు పాటల్ని తొలిగించి విడుదల చేసారు. అయితే అప్పటి మాయాబజార్ ని చూసిన చాలా మందికి ఆ పాటలు లేకపోవటం చాలా మందికి బాధ కలిగించింది. అందుకోసం 'చూపులు కలిసిన శుభవేళ' ను ఇప్పుడు మళ్ళీ జత చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రాన్ని కలర్ చేసి అందించిన సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ తరుపున వాకాడ అప్పారావు తెలియచేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..."మొదట్లో కలరైజేషన్ సరిగ్గా కుదరక పోవడం వల్ల తొలగించిన 'చూపులు కలిసిన శుభవేళ' సాంగ్‌ను ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు జత చేయనున్నాం. ఆ సాంగ్‌ను పూర్తి కలర్ క్వాలిటీతో ప్రేక్షకులు త్వరలో థియేటర్‌లో చూడొచ్చు అలాగే ఊహించిన దానికంటే మిన్నగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యువత కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











