చిరు కుటుంబం నుంచి మరో హీరో!
చిరంజీవి కుటుంబం నుంచి మరో నటుడు రాబోతున్నాడు. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి చాలా మందే ఉన్నారు. చిరంజీవి తండ్రి స్వర్గీయ వెంకట్రావు మొదలు వరుసగా చిరంజీవి, నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ నటులుగా తెర మీద కనిపించినవారే... కనిపిస్తున్నవారే.
ఇక తాజాగా మరో స్టార్ రాబోతున్నాడు. చిరంజీవి సోదరి కుమారుడు తేజ సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమాలకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడు. ఇక మిగిలింది కెమరా ముందు తన సత్తాను చాటు కోవడమే. తెలిసిందేమంటే రామ్ చరణ్ లాగా భారీ సినిమాతో కాకుండా సాదాసీదాగా తెరమీదకు రానున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











