2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
సంక్రాంతి అనగానే మన స్టార్ హీరోల బాక్సాఫీస్ రికార్డులే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. ప్రతి సంక్రాంతికి ఎదో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అవుతూ వస్తోంది. ఇక వచ్చే ఏడాది 2022లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా పాత రికార్డులు బ్లాస్ట్ అవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఫైట్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక వీరి మధ్యలో ఎవరు రారేమో అనుకుంటే మరో స్టార్ హీరో కూడా పోటీకి వస్తున్నట్లు తెలుస్తోంది.

ముందుగా మహేష్..
ముందుగా మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే సంక్రాంతికి రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. ఇక మొన్ననే పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా సంక్రాంతికి రానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

పవన్ కళ్యాణ్ vs మహేష్
మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు. ఈ ఇద్దరి హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగితే ఆ వాతావరణం మామూలుగా ఉండదు. మహేష్ సర్కారు వారి పాట కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ 27వ సినిమా 17శతాబ్దంలోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రానున్న పిరియాడిక్ మూవీ. రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ కాబట్టి తప్పకుండా రెండు హిట్టవుతాయని చెప్పవచ్చు.

పోటీలో నాగార్జున కూడా
ఇక ఇప్పుడు వీరి మధ్యలోకి సీనియర్ హీరో నాగార్జున కూడా చేరుతున్నట్లు టాక్ వస్తోంది. నాగార్జున కెరీర్ లో చాలా కాలం తరువాత బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.. 2016 సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ తోనే బంగార్రాజు టైటిల్ తో సినిమా చేయాలని కథ కూడా సెట్ చేయించాడు.

త్వరలోనే స్టార్ట్ కాబోతున్న షూటింగ్
ఈ సినిమా గత ఏడాది నుంచి చర్చల దశలోనే ఉంది. ఇక ఫైనల్ గా ఇటీవల నాగ్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రెస్ మీట్ లో త్వరలోనే బంగార్రాజు స్టార్ట్ కానుందని అన్నారు. ఇక పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ సినిమాని సంక్రాంతి భరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











