టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు.. టాలీవుడ్‌కు అలా దూరమైన తార!

తెలంగాణ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఓ స్టార్ హీరోయిన్ గురించి, ఆమె వైవాహిక దాంపత్య విఫలం గురించి మీడియాలో హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతున్నది. అయితే ఇదిలా ఉండగా, మరో హీరోయిన్ పేరు కూడా తాజాగా వినిపిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతోనే ఆమె తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఆ స్టార్ గురించి వివరాల్లోకి వెళితే..

గతంలో ఓ దక్షిణాదితోపాటు హిందీలో నటిస్తున్న స్టార్ హీరోయిన్‌తో గత ప్రభుత్వంలోని కీలక నేతకు సంబంధాలున్నాయనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శించారు. ప్రజా సమస్యల కంటే సినీ తారలతోనే ఆయన జోష్‌లో ఉన్నారనే విషయాన్ని మీడియా సమావేశాల్లో విమర్శించారు.

Another Star Heroine name surfaced in Telangana Telephone Tapping Case

అయితే ఆ సమయంలో స్టార్ హీరోయిన్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వేధించారు. ఆ టైమ్‌లో స్టార్ హీరోయిన్‌కు ఫ్లాప్ రావడంతో హిందీ సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టింది. దాంతో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తెలుగు, తమిళ సినిమా రంగానికి దూరమైంది. గత రెండేళ్లుగా టాలీవుడ్‌కు దూరమైంది.

ఈ సమయంలోనే బాలీవుడ్‌లో ఓ యువ నిర్మాతతోప్రేమలో పడింది. అలా రెండేళ్లు ప్రొడ్యూసర్‌తో డేటింగ్ చేసిన తర్వాత ఇటీవలే వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అయితే తాజాగా ఆ హీరోయిన్ పేరు ట్యాపింగ్‌లో వినిపిస్తున్నది. అయితే ఇంతకు ఆమె పేరు ట్యాపింగ్ వ్యవహారంలో ఉందా? లేక గాలివార్తల మాదిరిగా మీడియాలో వినిపిస్తున్నాయా? అనేది చర్చనీయాంశమైంది.

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు హీరో, హీరోయిన్ల పేరు వినిపిస్తున్నాయి. పలువురి ఫోన్లను ట్యాప్ చేసి వారిని వేధించారని, బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం తెలంగాణలో అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటపడుతున్నాయో భయం సినీ తారలను వెంటాడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X