శ్యామ్ కే నాయుడి ఎఫైర్ కేసులో కొత్త ట్విస్ట్.. మరో షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి!
టాలీవుడ్ లో గత కొంత కాలంగా శ్యామ్ కే నాయుడికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సినిమాటోగ్రాఫర్ లవ్ ఎఫైర్స్ రూమర్స్ తో అందరికి షాక్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి సుధ అతనిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు మరొక యూ టర్న్ తీసుకుంది. న్యాయస్థానం శ్యామ్ బెయిల్ క్యాన్సిల్ చేయడంతో ఈ కేసు మళ్ళీ ఉహీంచని మలువు తిరిగింది.
Recommended Video

ఐదేళ్లుగా ప్రేమలో..
ఇదివరకే పెళ్లి అయినప్పటికీ గత కొంత కాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సాయి సుధ పోలీసు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా పెళ్లి విషయాన్ని దాటవేసి తనను మోసం చేశాడాని శారీరకంగా వాడుకున్నాడని కూడా ఆమె ఆరోపణలు చేసింది.

రెండు రోజుకు తరువాత..
ఆమె చేసిన పిర్యాదుకు పోలీసులు శ్యామ్ కె నాయుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ అయిన రెండు రోజుల తరువాత బెయిల్ సంపాదించుకున్న శ్యామ్ మరో తప్పు చేసి కొత్త కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్ కూడా రద్దయినట్లు సమాచారం.

ఏం జరిగిందంటే..
శ్యామ్ కె నాయుడు, సాయి సుధ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయినట్లు ఇటీవల ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వచ్చింది. అది నిజమేనని చాలా మంది అనుకున్నారు. కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. కాంప్రమైజ్ అయినట్లు శ్యామ్ కూడా న్యాయస్థానంలో మరో పిటీషియన్ వేయగా మళ్ళీ సాయి సుధ అతనికి షాక్ ఇచ్చింది.

మరో కొత్త కేసు..
నిజానికి ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరవలేదని కాంప్రమైజ్ కాలేదని సాయి సుధ అసలు విషయాన్ని బయటపెట్టింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆమె కోర్టుకు మరో వివరణ ఇవ్వడంటజో శ్యామ్ కె నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసు నమోదు చేయడమే కాకుండా అతని బెయిల్ ని కూడా రద్దు చేసింది.


Click it and Unblock the Notifications











