భర్త నుండి విడాకులు తీసుకున్న అనౌష్క.... ఏం జరిగింది?
Recommended Video

అనౌష్క శంకర్.... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ సితార్ కళాకారిణి. ప్రముఖ సితార్ విధ్వాంసుడు, దివంగత పండిట్ రవిశంకర్ కుమార్తె అనౌష్క తాజాగా విడాకుల వార్తతో హాట్ టాపిక్ అయింది. బ్రిటీష్ ఫిల్మ్ డైరెక్టర్ జో రైట్‌ను 2010 సెప్టెంబర్‌లో పెళ్లాడిన అనౌష్క తన ఏడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది.

విడాకులు తీసుకున్నారు
ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెబ్ సైట్ 'పేజ్ సిక్స్' అనౌష్క, జో రైట్ విడాకుల విషయాన్ని ధృవీకరించింది. ఈ ఇద్దరూ ఇటీవలే విడిపోయారని జో ప్రతినిధి చెప్పినట్టు పేజ్ సిక్స్ వెల్లడించింది.

ఇద్దరు పిల్లలు
అనౌష్క, జో రైట్ దంపతులకు ఇద్దరు పిల్లల జుబిన్ శంకర్ రైట్, మోహన్ శంకర్ రైట్ సంరక్షణ, సంతోషం కోసం ఇకపై కూడా ఇద్దరూ కలసి బాధ్యత తీసుకుంటారంటూ జో ప్రతినిధి చెప్పినట్టు పేజ్ సిక్స్ వెల్లడించింది.

కారణాలు ఏమిటో?
గతేడాది ఆగస్టు వరకు ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ..... ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నరనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరి మధ్య అభిప్రాయ విబేధాలే వీరి విడాకులకు కారణమని తెలుస్తోంది.

అనుష్క శంకర్
తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న అనౌష్క శంకర్ సితార్ వాయించడంలో ఆరితేరింది. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్ షోలను నిర్వహిం చడం విశేషం. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి పాపులర్ అయింది.


Click it and Unblock the Notifications











