ఏఎన్ఆర్ 90వ బర్త్‌డేకి నాగార్జున గిఫ్ట్ ఏంటో తెలుసా?
ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారట. వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య అక్కినేని నాగేశ్వరరావు 90వ పుట్టినరోజు ఘనంగా నిర్వహించనున్నారట నాగార్జున. అభిమానులు, ప్రముఖుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి!
అక్కినేని హీరోలు ముగ్గురూ కలసి నటిస్తున్న చిత్రం 'మనం'. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ, సమంత హీరోయిన్స్. విక్రమ్ కుమార్ దర్శకుడు.అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.
తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సర సన సమంత నటిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ కి మంచి స్పందన లభించింది. దాంతో ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ 20 న జరగనుంది.


Click it and Unblock the Notifications












