twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనపించి.. అక్కినేని

    By Srikanya
    |

    మొన్ననే... ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. నాగచైతన్య, నేను 'గుండమ్మకథ" చేస్తే... బాగుంటుంది తాతయ్యా అన్నాడు. కానీ ఎస్వీఆర్, సూర్యకాంతం ఎక్కడ దొరుకుతారండీ? ముఖ్యంగా సూర్యకాంతం పాత్రకు ఎవరైనా కొత్త వారిని పరిచయం చేస్తే కొంతవరకు కరెక్ట్. అలాగే అది గొప్ప సినిమా అయినంత మాత్రాన దాన్ని మళ్లీ తీయకూడదు అనేం లేదు అన్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'గుండమ్మ కథ"రీమేక్ విషయమై ఇలా స్పందించారు. అలాగే తాను ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయటానికి కారణం చెప్తూ...స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య... అన్నారు. నా లోపాలను నేను గ్రహించాను కాబట్టే ఆ స్థాయికి ఎదగగలిగాను. ఏ పాత్రకైనా సరిపోయే చక్కని శారీరకభాష రామారావుది. కానీ నేను అలాకాదు.

    కొన్ని పాత్రలకే నా బాడీ సూట్ అవుతుంది. అందుకే... తగిన పాత్రలను ఎంచుకుంటూ కుటుంబ ప్రేక్షకులకు చేరువ కాగలిగాను. నాకు తెలిసి కుటుంబ ప్రేక్షకులకు చేరువ అయినవాడే పెద్ద మాస్ హీరో. రామారావు, నేను ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాను అన్నారు. ఇక తాను రాజకీయాల్లోకి రాకపోవటానకి కారణం చెప్తూ...ఇష్టం లేకే... అసలు ఆయన్ను కూడా వెళ్లొద్దని చెప్పాను. ప్రశాంతంగా జీవించడమే నాకిష్టం. అందుకే డెరైక్షన్ జోలికి కూడా పోలేదు. పైగా ఈ రాజకీయాల వల్ల సాధించేది కూడా ఏమీ లేదు. సమాజాన్ని మనం మార్చలేం. ఇక ఆరోగ్యం అంటారా... అదంతా నా తల్లిదండ్రుల జీన్స్ అని తేల్చి చెప్పారు.

    English summary
    Akkineni Nageswara Rao also agreed to remake Gundamma Katha Remake with Ntr and Naga Chaitanya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X