Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనపించి.. అక్కినేని
మొన్ననే... ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. నాగచైతన్య, నేను 'గుండమ్మకథ" చేస్తే... బాగుంటుంది తాతయ్యా అన్నాడు. కానీ ఎస్వీఆర్, సూర్యకాంతం ఎక్కడ దొరుకుతారండీ? ముఖ్యంగా సూర్యకాంతం పాత్రకు ఎవరైనా కొత్త వారిని పరిచయం చేస్తే కొంతవరకు కరెక్ట్. అలాగే అది గొప్ప సినిమా అయినంత మాత్రాన దాన్ని మళ్లీ తీయకూడదు అనేం లేదు అన్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'గుండమ్మ కథ"రీమేక్ విషయమై ఇలా స్పందించారు. అలాగే తాను ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయటానికి కారణం చెప్తూ...స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య... అన్నారు. నా లోపాలను నేను గ్రహించాను కాబట్టే ఆ స్థాయికి ఎదగగలిగాను. ఏ పాత్రకైనా సరిపోయే చక్కని శారీరకభాష రామారావుది. కానీ నేను అలాకాదు.
కొన్ని పాత్రలకే నా బాడీ సూట్ అవుతుంది. అందుకే... తగిన పాత్రలను ఎంచుకుంటూ కుటుంబ ప్రేక్షకులకు చేరువ కాగలిగాను. నాకు తెలిసి కుటుంబ ప్రేక్షకులకు చేరువ అయినవాడే పెద్ద మాస్ హీరో. రామారావు, నేను ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాను అన్నారు. ఇక తాను రాజకీయాల్లోకి రాకపోవటానకి కారణం చెప్తూ...ఇష్టం లేకే... అసలు ఆయన్ను కూడా వెళ్లొద్దని చెప్పాను. ప్రశాంతంగా జీవించడమే నాకిష్టం. అందుకే డెరైక్షన్ జోలికి కూడా పోలేదు. పైగా ఈ రాజకీయాల వల్ల సాధించేది కూడా ఏమీ లేదు. సమాజాన్ని మనం మార్చలేం. ఇక ఆరోగ్యం అంటారా... అదంతా నా తల్లిదండ్రుల జీన్స్ అని తేల్చి చెప్పారు.