తమిళ ఛానల్లో అక్కినేని బయోగ్రఫీ

By Bojja Kumar

దాదాపు 70 సంవత్సరాల పాటు ఎన్నో గొప్ప చిత్రాల్లో మహోన్నతమైన పాత్రలు పోషించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు ఆటో బయోగ్రఫీని ఇప్పడు తమిళ ప్రేక్షకులు వీక్షించనున్నారు. ప్రముఖ తమిళ ఛానల్ జయ టి.విలో ఏప్రిల్ 9 నుంచి 12 వరకు, ఏప్రిల్ 16 నుంచి 19 వరకు అంటే సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10.30గంటలకు ప్రసారం కాబోతోంది. జయ టి.విలో ఎంతో పాపులర్ అయిన తిరింబి పాక్కిరన్ అనే కార్యక్రమంలో డా. అక్కినేని నాగేశ్వరరావు ఆటో బయోగ్రఫీని తమిళ్‌లో ప్రసారం చేయబోతున్నారు.

1924 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నందివాడ మండలం రామాపురంలో జన్మించిన అక్కినేని చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను ధరించాడు. 1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కధా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944).

ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగింది.

1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణతో ఎఎన్ఆర్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని తన బార్య పేరుతతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా.. కుమారుడు నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X