twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్‌కి ఏఎన్నార్‌ పురస్కారం

    By Srikanya
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కి ప్రకటించారు. 2013కి సంబంధించిన పురస్కారాన్ని అమితాబ్‌కి అందజేస్తున్నట్టు అవార్డుల కమిటీ అధ్యక్షుడు టి.సుబ్బరామిరెడ్డి 'మనం' శతదినోత్సవంలో ప్రకటించారు. అందుకు అమితాబ్‌ అంగీకారం తెలుపుతూ సందేశం పంపినట్టు ఆయన చెప్పారు.

    అక్కినేని నాగేశ్వరరావుకీ, అమితాబ్‌ బచ్చన్‌కీ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఏఎన్నార్‌కి ఇష్టమైన నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ఏఎన్నార్‌పై ఉన్న అభిమానంతో ఆయన చివరి చిత్రమైన 'మనం'లో అమితాబ్‌ అతిథిగా తళుక్కున మెరిశారు.

    ANR award to Amitabh Bachchan

    చలనచిత్ర రంగంలో అలుపెరగని 'బాటసారి' అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమాతో పాటే అడుగులేశారు. అంచలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని నటుడు అనిపించుకొన్నారు. ఏఎన్నార్‌ వేసిన ప్రతి అడుగూ నేటి తరానికి ఓ పాఠమే. 74 ఏళ్లపాటు చిత్ర పరిశ్రమలో కొనసాగిన అరుదైన ఘనత ఆయన సొంతం. చివరి క్షణం వరకు నటుడిగానే ఉండాలనేది నా ఆశ.. ఆకాంక్ష అనేవారు ఏఎన్నార్‌. అనుకొన్నట్టుగానే బతికారు. తన తనయుడు, మనవళ్లతో కలసి 'మనం'లో నటించి వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. అక్కినేని మన మధ్యలేకపోవచ్చు, ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు.

    అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమైన 'మనం' వంద రోజుల వేడుక నేడు హైదరాబాద్‌లో జరుగుతుంది. అక్కినేని జయంతితో పాటు 'ఒక లైలా కోసం' ప్లాటినం డిస్క్‌ వేడుకను ఇదే వేదికపై నిర్వహిస్తారు.

    English summary
    Amitabh Bachchan has been chosen for ANR National Award and even Big B agreed to accept this rare honor, according to latest reports.Occasion of ANR's birth anniversary, the Akkineni family has given a good news. As part of the Manam 100days and Oka Laila Kosam Audio release celebrations, the prestigious ANR National Award for the year 2014 has been announced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X