Just In
- 52 min ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 1 hr ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 1 hr ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
- 2 hrs ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
Don't Miss!
- News
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- Sports
ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం, బాబర్ అజామ్ తొలిసారి టాప్-10లోకి!
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
అత్యంత వైభవంగా ANR అవార్డ్స్.. శ్రీదేవికి పురస్కారం.. బోనీ కపూర్ కన్నీరు
నటసామ్రాట్, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో ఎవరెవరికి అవార్డ్స్ దక్కాయి. ఆ వివరాలు చూద్దామా..

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది. బోనీ కపూర్ సహా సినీ ప్రముఖులంతా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గతేడాది ఇవ్వలేదు కాబట్టి.. చిరంజీవి చేతుల మీదుగా
గతేడాది ANR అవార్డ్స్ ప్రకటించినందున ఈ ఏడాదే గత సంవత్సర అవార్డును కలుపుకుని, ఈ సంవత్సర అవార్డులు సైతం ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖ ఈ అవార్డు సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదులగా అవార్డులను ప్రధానం చేశారు.

బోనీ కపూర్ కన్నీరు
శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ ఈ ANR అవార్డును అందుకున్నారు. చిరంజీవి చేతుల మీదుగా రేఖ ఈ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా బోనీ కపూర్.. భార్యను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. శ్రీదేవి తరఫున అవార్డు అందుకున్న ఆయన.. వేదికపై మాట్లాడే క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు వస్తుంటే మాట్లాడలేక.. థ్యాంక్స్ మాత్రమే చెప్పి తన స్పీచ్ ముగించాడు బోనీ కపూర్.

శ్రీదేవితో నాగార్జున అనుబంధం
ఇక ఈ ANR అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు అమల, నాగ సుశీల, నాగచైతన్య, సుమంత్, సుశాంత్, అఖిల్‌తో పాటు అక్కినేని అవార్డ్స్ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్బంగా శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నాగార్జున.