twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మకి ఆయనంటే అంత పిచ్చి.. ఆ విషయాలు చెప్పి ఆకట్టుకున్న చిరంజీవి

    |

    Recommended Video

    ANR National Awards 2019 : Mega Star Chiranjeevi Great speech @ ANR National Awards Function

    మెగాస్టార్ చిరంజీవికి అమ్మ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనుక్షణం అమ్మను తలుస్తూ ఉంటారాయన. అలాంటి మెగాస్టార్ తాజాగా నిన్న జరిగిన ANR అవార్డ్స్ కార్యక్రమంలో తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. అమ్మ గురించి వివరిస్తూ, ANR పై ఆమె అభిమానం ఎలా ఉండేదో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు చూద్దామా..

    ANR అవార్డ్స్ వేదికపై చిరు

    ANR అవార్డ్స్ వేదికపై చిరు

    ANR అవార్డ్స్ కార్యక్రమంలో తన చేతుల మీదుగా రేఖకు అవార్డు అందించిన చిరు.. వేదికపై కాసేపు మాట్లాడారు. ఒక చిన్న కథతో ప్రారంభమైన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన చెప్పిన సంగతులు విని ఆశ్చర్యపోయారు అక్కడున్న సినీ ప్రముఖులు.

     జట్కా బండిలో సినిమాకు బయల్దేరి.. నిండు గర్భిణీ

    జట్కా బండిలో సినిమాకు బయల్దేరి.. నిండు గర్భిణీ

    ''అదొక పల్లెటూరు. కొత్తగా పెళ్లయిన జంట. ఆమె నిండు గర్భవతి. రేపో మాపో డెలివరీ అయ్యే సమయం. అదే సమయంలో తన అభిమాన నటుడి సినిమా విడుదలైంది. పక్కనున్న టౌన్‌కు వెళ్లి సినిమా చూడాలి. బిడ్డకు జన్మనిచ్చిన తరవాత సినిమా చూసే అవకాశం ఉండదు. ఈ కోరికను తన భర్తకు చెప్పుకుంది. ఈ సమయంలో ఎలా వెళ్తావు అన్నాడు భర్త. ఎలాగైనా వెళ్లాలి అంది. గర్భంతో ఉన్న భార్య కోరిక తీరుద్దామని ఆ భర్త సరే అన్నాడు. జట్కా బండిలో సినిమాకు బయల్దేరతారు.

    గుర్రం కొంచెం కంగారు పడటంతో

    గుర్రం కొంచెం కంగారు పడటంతో

    అదే సమయంలో రోడ్డు మీద పశువుల మంద వస్తోంది. దీంతో గుర్రం కొంచెం కంగారు పడింది. చక్రం గుంతలో పడటంతో జట్కా బండి కింద పడిపోయింది. ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్త చాలా కంగారుపడ్డాడు. నిండు గర్భిణి అయిన తన భార్యకు ఎలా ఉందోనని భయపడ్డాడు. వెంటనే ఆమెను లేవదీసి ఎలా ఉందని అడిగాడు. చిన్న చిన్న దెబ్బలే పర్వాలేదు అంది. సర్లే వెనక్కి వెళ్లిపోదాం.. రిస్క్ చేయొద్దు అన్నాడు భర్త. ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది ఆమె.

    ఇదీ అసలు సంగతి

    ఇదీ అసలు సంగతి

    మొత్తానికి సినిమా చూశారు. ఆమె ఎంతో ఆనందపడింది. ఇంటికొచ్చిన తరవాత సినిమా చూపించిన భర్తపై ఎంతో ప్రేమ కురిపించింది. ఈ కథలో ఆ గర్భిణి మా అమ్మ అంజనాదేవి. ఆ భర్త మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు.. పక్కనున్న టౌన్ నర్సాపురం. సంవత్సరం 1955. ఆ సినిమా ‘రోజులు మారాయి'. ఆ కథానాయకుడు ఎవరో కాదు.. ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు'' అని చెప్పి ఆశ్చర్యపరిచాడు మెగాస్టార్.

    అమ్మకి ఆయనంటే అంత పిచ్చి..

    అమ్మకి ఆయనంటే అంత పిచ్చి..

    అమ్మకి ఆయనంటే అంత పిచ్చి. ఆయన సినిమాలను ఏదీ వదిలిపెట్టలేదు. ఇంతకీ ఆ కడుపులో ఉన్నది నేనే. అమ్మకు సినిమా మీద, నాగేశ్వరరావు గారి మీద అంత అభిమానం ఉంది కాబట్టే.. బహుశా కడుపులో ఉన్న నాకు కూడా సినిమా అంటే అంత ఇష్టం ఏర్పడింది అని చిరంజీవి అన్నారు.

    English summary
    In Hyderabad Annaurna Studios ANR Awards 2019 programe done very much grandly. In this event Chiranjeevi came chief guest. In this event he says a super story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X