twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్‌ 2012 సంవత్సరానికిగాను డా.అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్‌కి ఎంపికయిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ మాదాపూర్లో ఘనంగా జరిందింది.
    ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి మనీష్ తివారీ, సుబ్బిరామిరెడ్డి, రామానాయుడు, కె విశ్వనాథ్, విజయేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ...ప్రతిభావంతులను పురస్కరించాలనే ఉద్దేశ్యంతోనే ఈ అవార్డును నెలకొల్పినట్లు తెలిపారు. ఈ అవార్డు ఎంపికలో టి. సుబ్బిరామిరెడ్డి, డి. రామానాయుడు, బోనీకపూర్ ముఖ్య పాత్ర పోషిస్తారని, భారతీయ సినిమాకు అన్ని విధాలా సేవలు అందించిన శ్యాంబెనగరల్ కు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు.

    ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ (ఫోటోలు)

    ఎఎన్ఆర్ అవార్డ్ అందుకుంటున్న శ్యాంబెనగల్

    ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ (ఫోటోలు)

    అవార్డు ఫంక్షన్లో నాగేశ్వరరావు, నాగార్జున, సుబ్బిరామిరెడ్డి, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి మనీష్ తివారీ, శ్యాం బెనగల్

    ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ (ఫోటోలు)

    అవార్డు ఫంక్షన్లో నాగచైతన్య, సుశాంత్

    ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ (ఫోటోలు)

    అవార్డు ఫంక్షన్లో అక్కినేని మనవరాలు సుప్రియ, హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్

    ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ (ఫోటోలు)

    అతిథులను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న ఎఎన్ఆర్

    అవార్డు గ్రహీత శ్యాంబెనగల్ మాట్లాడుతూ...ఈ అవార్డు అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు సినిమాలు తీస్తానని చెబితే అంతానన్ను బుద్దిలేని వాడిలా చూసే వారు. కానీ ఇప్పుడు అదే హైదరాబాద్ లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు సినీపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడంలో ఏఎన్ఆర్ ఎనలేని కృషి చేసారు. ఈ రోజు ఇండియాలోనే అత్యధికంగా తెలుగులో సినిమాలు నిర్మితం అవుతూ భారతీయ సినీపరిశ్రమకు హైదరాబాద్ క్యాపిటల్ గా మారింది. తెలుగు సినీ పరిశ్రమ ఇంత అభివృద్ధి చెందడం మనందరికీ గర్వకారణమన్నారు.

    English summary
    
 Veteran director of Indian film industry Shyam Benegal was awarded with the ANR Award for the year 2012, at an event held at N Convention Center in Hyderabad on February 9, 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X