ANR బర్త్‌డే సెలబ్రేషన్స్100 ఏళ్ల సినిమా పండగ?

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20న 90వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు వేడుకలను ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే '100 ఏళ్ల భారతీయ సినిమా' సెలబ్రేషన్స్‌ ఓపెనింగ్ సెర్మనీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'అయితే ఈ విషయం ఇంకా ఖరారు కాలేదు. 100 ఏళ్ల సినిమా పండగలో ఏఎన్ఆర్ పెట్టినరోజు సెలబ్రేషన్స్‌ను నిర్వహించాలా? వద్దా? అనే దానిపై నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. సీనియర్ నటుడు కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుక నిర్వహించడం మంచిదే అని కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తుండగా....మరికొందరు మాత్రం 100 ఏళ్ల సినిమా పండగలో అలాంటి కార్యక్రమాలు అనవసరం? అని వ్యతిరేకిస్తున్నారట.

Akkineni Nageswara Rao

మరో వైపు హీరో నాగార్జున తన తండ్రి పుట్టిన రోజు వేడుకలను 'భాయ్' మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని...ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

అక్కినేని హీరోలు ముగ్గురూ కలసి నటిస్తున్న చిత్రం 'మనం' చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయనున్నారట. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ, సమంత హీరోయిన్స్. విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు.అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సినిమా తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X