Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 62 ఏళ్లు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : తెలుగు వారికి ‘దేవదాసు' అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం నేటితో 62 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1953 జూన్ 26న విడుదలై ఈచిత్రం అప్పట్లో ఓ సంచలనం. తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు ఆజ్యం పోసింది కూడా ఈ సినిమానే.
వాస్తవానికి ‘దేవదాసు' మన కథ కాదు. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవదాసు నవలను తెలుగులో చక్రపాణి అనువదించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డిఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
శరత్ సృష్టించిన గొప్ప పాత్ర నాగేశ్వరరావు చెయ్యడమేమిటని తొలుత విమర్శలు వచ్చాయి. అదే విధంగా పార్వతి పాత్రకు సావిత్రిని తీసుకోవడంపై, రాఘవయ్య ఈ సినిమాకి దర్శకుడిగా సరిపోడు అంటూ విమర్శలు వచ్చాయి. ఎవరెన్ని మాటలన్నా, నష్టపోతారని భయపెట్టినా మొండిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలెంజ్‌గా తీసుకుని తెరకెక్కించడం వల్లనే ఈ సినిమా అంత ఘన విజయం సాధించింది.
సినిమా గొప్ప
ఈ
చిత్రానికి
సీనియర్
సముద్రాల
మాటలు,
పాటలు
హైలైట్‌గా
నిలిచాయి.
11
పాటలుండటమే
ఈ
సినిమా
గొప్ప.
వేటికవే ప్రత్యేకత
"పల్లెకుపోదాం..
పారును
చూద్దాం
చలోచలో..",
"అంతా
భ్రాంతియేనా
జీవితాన
వెలిగింతేనా...",
"కుడి
ఎడమైతే
పొరపాటు
లేదోయ్...",
"జగమే
మాయ
బ్రతుకే
మాయ.."
ఇలా
వేటికవే
ప్రత్యేకతే.
హిందీ, తమిళం
1937లో
లో
హిందీలో
పి.సి.బారువా
తొలిసారిగా
కె.ఎల్.సైగల్,
జమునలతో
‘దేవదాసు'
చిత్రాన్ని
నిర్మించాడు.
అదే
సంవత్సరంలో
తమిళంలోనూ
సి.వి.రావు
నటుడు,
దర్శకుడుగా
దేవదాసు
సినిమా
వెలువడింది.
2002లో..
మళ్ళీ
1955లో
హిందీలో
దిలీప్
కుమార్,
వైజయంతిమాల,
సుచిత్రాసేన్‌లతో
మరొక
దేవదాసు
వచ్చింది.
మళ్ళీ
హిందీలో
లో
షారుక్
ఖాన్,
ఐశ్వర్యారాయ్,
మాధురీ
దీక్షిత్‌లతో
2002లో
ఇదే
కథ
సినిమాగా
వచ్చింది.
అన్ని భారతీయ భాషల్లో..
అన్ని
భారతీయ
భాషలలో
కలసి
దాదాపు
10
సార్లు
ఈ
సినిమా
విడుదల
అయినా
నాగేశ్వరరావు
దేవదాసుగా
నటించిన
ఈ
చిత్రానికి
వచ్చినంత
పేరు
మరే
దేవదాసు
చిత్రానికీ
రాలేదు.
కృష్ణ కూడా...
1974లో
కృష్ణ
దేవదాసుగా
నటించిన
సినిమా
విడుదలై
50రోజులు
ఆడితే,
అదే
సమయంలో
మళ్ళీ
విడుదలైన
నాగేశ్వరరావు
దేవదాసు
200
రోజులు
ఆడింది.